అతగాడో క్రేజీ హీరో. పెద్ద బ్లాక్ బస్టర్ చేతిలో వున్నా తరువాత సినిమా మాత్రం ఇవ్వాళ, రేపు అంటూ సాగుతోంది ఆ తరువాత మరో సినిమాకు సైన్ చేసాడు. చేతిలో వున్న సినిమా పూర్తయినా తరువాత సినిమా సెట్ మీదకు వెళ్లలేదు. ఏంటీ రీజన్ అంటే డైరక్టర్ ఫేస్ నచ్చలేదు అనే రీజన్ వినిపిస్తోంది.
తరువాత సినిమాకు ఓ కొత్త దర్శకుడుని సెట్ చేసారు. కథ విన్నాడు. ఒకె అన్నాడు. అంతా బాగానే వుంది. కానీ ఈ మధ్యనే ఎందుకో తేడా వచ్చింది.
కథ ఓకె కానీ డైరక్టర్ నాట్ ఓకె అంటున్నాడట సదరు హీరో. కానీ ఆ కథ ఆ దర్శకుడిదే. డైరక్టర్ గా వద్దు అంటే కథ ఎందుకు ఇస్తాడు. అందుకే హీరోను ఒప్పించాడానికి నిర్మాతలు కుస్తీ పడుతున్నారు. గమ్మత్తేమిటంటే దర్శకుడు ఎందుకు వద్దు అన్నదానికి హీరో దగ్గర నుంచి సమాధానం లేదని తెలుస్తోంది. పోనీ పనితీరు నచ్చలేదా అంటే ఇంకా షూటింగ్ నే మొదలు పెట్టలేదు కదా.
ఆల్ ఇన్ వన్ టైపు హీరో. అందువల్ల అన్నింటిలో కాళ్లు చేతులు పెట్టేస్తాడని టాక్ వుండనే వుంది. పేజీ డైలాగులను పది పేజీలు చేసేస్తాడని కూడా టాక్. అందువల్ల డైరక్టర్ ఇలాంటి వాటికి అడ్డం పడి వుంటాడు. అందుకే డైరక్టర్ ను మార్చాలి అంటున్నాడేమో అని ఇండస్ట్రీలో కామెంట్లు వినిపిస్తున్నాయి.