వెంకీ మామ.. గాయమా? భయమా?

దసరా బరి నుంచి వెంకీ మామ తప్పుకుంటోంది. ఇది అనివార్యంగా కనిపిస్తోంది. నాగచైతన్య-విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న సినిమా వెంకీ మామ. ఈ సినిమాకు బాబీ దర్శకుడు. సైరా…

దసరా బరి నుంచి వెంకీ మామ తప్పుకుంటోంది. ఇది అనివార్యంగా కనిపిస్తోంది. నాగచైతన్య-విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న సినిమా వెంకీ మామ. ఈ సినిమాకు బాబీ దర్శకుడు. సైరా లాంటి పెద్ద సినిమా వున్నా కూడా అక్టోబర్ 4న విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, దసరా బరి నుంచి వెంకీ మామ వెనక్కు జరుగుతోంది అన్నది. విక్టరీ వెంకటేష్ కాలు బెణకడం దీనికి కారణంగా చెబుతున్నారు. వారం పదిరోజుల క్రితం వెంకటేష్ కాలు బెణికింది. ఆయన మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బందిపడ్డారు. ఇదే విషయం అప్పట్లో యూనిట్ ను అడిగితే, 'అబ్బే అదేం లేదు, చిన్న గాయం. షూటింగ్ కు వస్తున్నారు' అని సమాధానం వచ్చింది.

అదే యూనిట్ ఇప్పుడు మరో మాట చెబుతోంది. వెంకటేష్ గారు ఇప్పట్లో షూటింగ్ కు హాజరయ్యేలా లేదు పరిస్థితి అంటోంది. అందువల్ల దసరాలకు విడుదల వుంటుందో? వుండదో? ఇప్పట్లో చెప్పలేము అని డౌట్ ఫుల్ గా చెబుతున్నారు. కానీ వేరే రకమైన సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.

సైరా మేకింగ్ వీడియో చూసాక, దాని భారీతనం అర్థం అయిందని, అలాంటి సినిమా మీద వేస్తే, అనవసరంగా ఇబ్బందిపడే అవకాశం వుందని, అందువల్ల ఎలాగూ వెంకీకి గాయం అన్న పాయింట్ వాడుకుని, సినిమాను వెనక్కు తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారని కూడా వినిపిస్తోంది.

వెంకీ మామ సినిమాకు యాభై కోట్లకు పైగా బడ్జెట్ అయింది. అంత మొత్తం రికవరీ కావాలంటే డేట్ బాగుండాలి. వీలైతే సోలో డేట్ కావాలి. సురేష్ బాబు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా వుంటారు. ఓ బేబీ సినిమాకు కూడా ఆయన చాలా ప్లాన్ వేసి, అన్నీ జాగ్రత్తపడి సోలో డేట్ తెచ్చుకుని గట్టెక్కారు.

అందువల్ల వెంకీ మామ వ్యవహారం వెనుక కూడా ఆయన ప్లానింగ్ ఏదో దాగి వుండి వుంటుందని సందేహాలు వినిపిస్తున్నాయి.

దేవరకొండ షేక్‌ అయ్యాడు

సినిమా రివ్యూ: ఎవరు   సినిమా రివ్యూ: రణరంగం