చంద్రబాబు తన నేర్పుతో తుపాను సైతం ఆపేశారు.
బాలకృష్ణ కంటిచూపుతో ట్రయిన్ ను ఆపేశాడు.
ఇప్పుడు లోకేష్ చిన్న బోటుతో వరదను దారి మళ్లించాడు.
అవును.. తన తండ్రి, మామకు ఏమాత్రం తీసిపోలేదు లోకేష్. చంద్రబాబు సెల్ ఫోన్ ను సృష్టించినట్టు, బాలయ్య తొడకొట్టి ట్రైన్ ఆపేసినట్టు.. ఇప్పుడు లోకేష్ కూడా చిన్న బోటుతో వరదను దారి మళ్లించాడు. అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం.
ఈరోజు చినబాబు ఓ ట్వీట్ పెట్టారు. కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు తెప్పించడం కోసం.. వైసీపీ నేతలు బ్యారేజీ గేట్లకు అడ్డంగా పడవ పెట్టారట. ఆ పడవ సాయంతో వరదను దారి మళ్లించి చంద్రబాబు నివశిస్తున్న ఇంటివైపు పంపించారట. ఫలితంగా చంద్రబాబు ఇల్లు వరదలో మునిగిపోయిందట. ఇది లోకేష్ పెట్టిన ట్వీట్. దీనికోసం రాత్రింబవళ్లు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని లోకేష్ ఆరోపిస్తున్నారు.
నిజంగా బుద్ధి ఉన్నోడు ఎవడూ ఇలాంటి ట్వీట్లు వేయడు. కనీసం పెట్టే ట్వీట్ లో లాజిక్ అయినా చూసుకోవాలి కదా. చిన్న పడవతో వరదను ఆపగలమా..? అదే వరదను దారి మళ్లించగలమా? నిజంగా ఇదే సాధ్యమైతే ఇన్ని ఆనకట్టలు ఎందుకు? నదీ పరివాహక ప్రాంతాల్లో ఇన్ని రాతికట్టలు ఎందుకు? ఈ మాత్రం కూడా అవగాహన లేని లోకేష్.. తన చావు తెలివితేటల్ని చూపించారు.
భారీ వరదలకు పాపం మత్స్యకారుల బోట్లు కొట్టుకొని పోయి ఉంటాయి. ఆ బోట్లే గేట్లు తెరిచినప్పుడు చిక్కుకొని ఉంటాయి. ఆ వీడియోను ఎవరో లోకేష్ కు పంపించి ఉంటారు, అతడి ఆస్థానంలో ఉన్న అతితెలివి వ్యక్తులు ఈ కొత్త లాజిక్ చెప్పి ఉంటారు. అంతే, వెంటనే బోట్ కు ఓ సర్కిల్ వేసి మరీ పోస్ట్ పెట్టేశాడు మన “తెలివైన” లోకేష్. చినబాబు అతితెలివికి ట్విట్టర్ తో తిట్ల వర్షం కురుస్తోంది. తండ్రిని మించిపోయావంటూ నెటిజన్లు గట్టిగా తగులుకుంటున్నారు.
ఇవన్నీ ఒకెత్తయితే.. తన ట్వీట్ కు తానే కౌంటర్ ఇచ్చుకున్నారు లోకేష్. వైసీపీ నేతలు బోటు సాయంతో వరదను చంద్రబాబు ఇంటివైపు మళ్లిస్తున్నారని ఆరోపించిన కొద్దిసేపటికే.. చంద్రబాబు నివాసం మునిగిపోలేదని, కావాలనే అసత్యపు వార్తలు ప్రసారం చేస్తున్నారంటూ మరో ట్వీట్ పెట్టారు. ఒక ట్వీట్ లో తండ్రి నివాసం మునిగిపోయిందని ఆరోపిస్తూ, ఆ వెంటనే ఇల్లు మునగలేదు, ఔట్ హౌజ్ వరకు మాత్రమే నీళ్లు వచ్చాయని లోకేష్ చెప్పడం విడ్డూరం. ఇలా ఒకదానితో ఒకటి పొంతనలేని రెండు ట్వీట్లు పెట్టి పూర్తిస్థాయిలో వెర్రివెంగలప్ప అయ్యారు చినబాబు.