హిందీ బిగ్ బాస్ 16 లో పార్టిసిపేట్ చేస్తున్న బాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు సాజిద్ ఖాన్ పై ఆరోపణల పరంపర కొనసాగుతూ ఉంది. కొన్నాళ్ల కిందట మీ టూ వివాదంలో సాజిద్ పేరు గట్టిగా వినిపించింది. తాము సాజిద్ చేతిలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్టుగా కొందరు ఆరోపించారు. అప్పటి నుంచి సాజిద్ కు సినీ అవకాశాలు తగ్గిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో అతడు బిగ్ బాస్ 16లో పాల్గొనడంతో మళ్లీ పాత విషయాలు తెరపైకి వస్తున్నాయి. అలాగే కొత్త ఆరోపణలు కూడా!
కొన్నేళ్ల కిందట సాజిద్ ఖాన్ *హిమ్మత్ వాలా* అంటూ అజయ్ దేవగణ్ హీరోగా ఒక సినిమా చేశాడు. ఆ సినిమా ఒక తెలుగు సినిమాకు రీమేక్. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఊరికి మొనగాడు అనే సినిమా ఒకటి ఉంటుంది. దాన్ని అప్పట్లోనే హిందీలో హిమ్మత్ వాలా గా రీమేక్ చేశారు. ఆ సినిమాను మరోసారి అదే పేరుతో అజయ్ దేవగణ్ హీరోగా రీమేక్ చేశారు. తమన్నా అందులో హీరోయిన్. పాటలైతే బాగా హిట్ అయ్యాయి. కానీ.. సినిమా మాత్రం డిజాస్టర్ అనిపించుకుంది.
ఆ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ విషయంలో పరిగణనలోకి తీసుకున్న భోజ్ పురి నటి రాణీ ఛటర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఐటమ్ సాంగ్ లో నర్తించే విషయంలో తనను ఇంటర్వ్యుకు అని పిలిచి సాజిద్ ఖాన్ ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేశాడని ఆమె అంటోంది.
తన బ్రెస్ట్ సైజ్ ఎంతో చెప్పాలంటూ అతడు అడిగాడని ఆమె అంటోంది. అలాగే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా.. అతడితో రెగ్యులర్ గా ఇంటర్ కోర్స్ లో పాల్గొంటూ ఉంటావా.. అని కూడా అతడు తనను ప్రశ్నించాడని ఆమె అంటోంది. ఈ ప్రశ్నలతో తను నిశ్చేష్టురాలిని అయినట్టుగా ఆ నటీమణి అంటోంది. మొత్తానికి సాజిద్ పై ఇలాంటి ఆరోపణల పరంపర కొనసాగుతూ ఉంది. మీ టూ వివాదంతో మొదలైన ఈ రచ్చ ఇప్పటికీ ఇలా కొనసాగుతూ ఉంది.