చంద్రబాబు అసహనంలో ఇది మరో అంకం!

అమరావతికి కొత్తగా గవర్నర్ వచ్చారు. ఇన్నాళ్లూ ఏపీ గవర్నర్ అంటే హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు సాగించే వారు. అలాంటిది తొలిసారి గవర్నర్ అమరావతి నుంచి కార్యకలాపాలు ప్రారంభించారు. కొత్త గవర్నర్, కొత్త రాజ్ భవన్..…

అమరావతికి కొత్తగా గవర్నర్ వచ్చారు. ఇన్నాళ్లూ ఏపీ గవర్నర్ అంటే హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు సాగించే వారు. అలాంటిది తొలిసారి గవర్నర్ అమరావతి నుంచి కార్యకలాపాలు ప్రారంభించారు. కొత్త గవర్నర్, కొత్త రాజ్ భవన్.. ఇలాంటి నేపథ్యంలో అక్కడ నిర్వహించిన అట్ హోం కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం హాజరుకాలేదు.

మామూలుగా ఈ ప్రోగ్రామ్ కు అన్నిపార్టీల వాళ్లూ హాజరవుతారు. గత ఐదేళ్లలో ఇలాంటి సన్నివేశాలను అంతా గమనించారు. అప్పుడు అట్ హోం ప్రోగ్రామ్ కు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యేవారు. హైదరాబాద్ వేదికగా రాజ్ భవన్ లో జరిగే ఆ కార్యక్రమానికి జగన్ హాజరవుతూ వచ్చారు.

ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీ అధ్యక్షులు ఆ కార్యక్రమానికి హాజరయ్యే వారు. అధికారంలో ఉన్న వారు, అధికారంలో లేనివారు కలిసి కనిపించే ప్రోగ్రామ్ అది. అక్కడ ఎవరితో ఎవరు ఎలా ప్రవర్తించారనే అంశం మీడియాలో ప్రత్యేకంగా చర్చనీయాంశం అయ్యేది. అయితే అమరావతి వేదికగా జరిగిన అట్ హోం కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరుకాలేదు.

చంద్రబాబు నాయుడు  అసలు అమరావతిలోనే లేరు. ఆయన హైదరాబాద్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఇంటిని వరద చుట్టుముట్టగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని ఇంట్లో ఉన్నారు. అటు వరద, మరోవైపు అట్ హోంలో అంతా చంద్రబాబుకు శత్రువుల్లాంటి వారే కనిపిస్తారు. సీఎం జగన్, బీజేపీ ఏపీ విభాగం అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ.. వారందరి మధ్యన చంద్రబాబు నాయుడు నిలబడలేని పరిస్థితి.
 
ఎన్నికల ముందు ఎవరెవరిని చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడారో అందరికీ తెలిసిన సంగతే. ఎన్నికల వేడిలో జనాలు పెద్దగా పట్టించుకోలేదు కానీ, జగన్ విషయంలో చంద్రబాబు నాయుడు అత్యంత దారుణమైన మాటలు మాట్లాడారు. అలాంటి మాటలు మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీఎంగా జగన్ వైభవాన్ని అలా దగ్గర నుంచి చూడటానికి ముందుకు రాకపోవచ్చు.

దేవరకొండ షేక్‌ అయ్యాడు

సినిమా రివ్యూ: ఎవరు   సినిమా రివ్యూ: రణరంగం