నవరత్నాల గుబాలింపు.. ఇది సామాన్యుల బడ్జెట్

బడ్జెట్ అంటేనే అంకెల గారడీ. అదొక మాయాజాలం. సామాన్య ప్రజానీకానికి ఓ బ్రహ్మపదార్థం. పేపర్ పై కోటాను కోట్లు కనిపిస్తాయి. జనాలు మాత్రం సంక్షేమ పథకాలకు, ఫలాలకు దూరంగానే ఉంటారు. పదవిలోకి వచ్చిన తొలి…

బడ్జెట్ అంటేనే అంకెల గారడీ. అదొక మాయాజాలం. సామాన్య ప్రజానీకానికి ఓ బ్రహ్మపదార్థం. పేపర్ పై కోటాను కోట్లు కనిపిస్తాయి. జనాలు మాత్రం సంక్షేమ పథకాలకు, ఫలాలకు దూరంగానే ఉంటారు. పదవిలోకి వచ్చిన తొలి రోజు నుంచి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. బడ్జెట్ పై మరోసారి తనదైన మార్క్ చూపించారు.

వివిధ రంగాలకు కేటాయింపులు ఇస్తూనే, ఆ రంగాలకు సంబంధించి పథకాలకు ఎన్ని కోట్లు కేటాయిస్తున్నారనే విషయాన్ని కూడా స్పష్టంగా వెల్లడించారు. దీని వల్ల నవరత్నాలకు ఎంత కేటాయింపులు జరిగాయనే విషయంపై స్పష్టంత రావడంతో పాటు.. పథకాలకు నిధుల కేటాయింపులపై సామాన్యులకు కూడా ఓ అవగాహన ఏర్పడినట్టయింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 122 హామీల్లో 77 హామీల్ని నెరవేర్చామని ప్రకటించిన ప్రభుత్వం.. అందుకు తగ్గట్టుగానే ప్రతి పథకానికి కేటాయింపులు ఇచ్చింది. ఇలా హామీల సంఖ్యను అసెంబ్లీలో ప్రకటించిన మొట్టమొదటి ప్రభుత్వం వైసీపీ సర్కార్. ఇక కేటాయింపుల విషయానికొస్తే.. జగనన్న విద్యాకానుకకు 500 కోట్లు.. గ్రామ సచివాలయాల కోసం 1633 కోట్లు.. వైఎస్ఆర్ గృహ వసతి కోసం 3000 కోట్ల రూపాయలు కేటాయించారు.

ఇక ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు ఏకంగా 16వేల కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి. దీంతో పాటు.. డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ పథకానికి 1365 కోట్ల రూపాయలు.. అమ్మఒడికి 6 కోట్లు.. వైఎస్ఆర్ ఆసరా పథకానికి 6300 కోట్లు.. వైఎస్ఆర్ రైతుభరోసాకు 3615 కోట్లు, జగనన్న విద్యాదీవెనకు 2277 కోట్లు కేటాయింపులు జరిగాయి.

ఇప్పుడు చెప్పుకున్నవి కేవలం కొన్ని కీలకమైన పథకాలు మాత్రమే. బడ్జెట్ లో అన్ని పథకాలకు ప్రాధాన్యతను బట్టి కేటాయింపులు జరిగాయి. మొత్తంగా చూసుకుంటే.. జగన్ పాలనలో సామాన్యులందరికీ లబ్ది జరిగేలా ఉంది బడ్జెట్. ఇప్పటికే నవరత్నాల ఫలాల్ని అందుకుంటున్నారు ప్రజలు. త్వరలోనే మరిన్ని పథకాలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఏ ఒక్క పథకానికి లోటు లేకుండా కేటాయింపులు జరిగాయి. అందుకే ఇది సామాన్యుడి బడ్జెట్ అయింది.

జగన్ తో పోటీ కష్టం బాబూ

జగన్ లాంటి సీఎంతో పనిచెయ్యడం నా అదృష్టం