సుశాంత్ మ‌ర‌ణంపై స్పందించిన పోలీసులు

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణంపై ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఆయ‌న‌ను ఎవ‌రో హ‌త్య…

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణంపై ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఆయ‌న‌ను ఎవ‌రో హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించార‌ని అంటూ బిహార్ కు చెందిన ఒక రాజ‌కీయ నేత అభిప్రాయ‌ప‌డ్డారు. సుశాంత్ కు ఆర్థిక ఇబ్బందులు కూడా లేవ‌ని ఆయ‌న కుటుంబీకులు చెప్పిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. స్థూలంగా సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం సినీ అభిమానులు పెద్ద షాకింగ్. దీంతో స‌హ‌జంగానే కొంద‌రిలో అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. 

ఈ క్రమంలో సుశాంత్ పోస్టుమార్టం నివేదిక పై పోలీసులు స్పందించారు. పోస్టుమార్గం రిపోర్టును బ‌ట్టి సుశాంత్ ది ఆత్మ‌హ‌త్యే అని స్ప‌ష్టం అవుతోంద‌ని ముంబై పోలీసులు ప్ర‌క‌టించారు. సుశాంత్ హ‌త్య చేసి, ఆత్మ‌హత్య‌గా చిత్రీక‌రించిన అనావాళ్లు ఉన్న‌ట్టుగా పోలీసులు చెప్ప‌లేదు. పోస్టుమార్టం రిపోర్టు ప్ర‌కారం.. ఆత్మ‌హ‌త్య అని వాళ్లు వ్యాఖ్యానించారు.

అయితే మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఈ విష‌యంపై విచార‌ణ జ‌రిపించ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించింది. సుశాంత్ మ‌ర‌ణం ప‌ట్ల కొంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్న నేప‌థ్యంలో.. ఆ అంశంపై విచార‌ణ కు ఆదేశిస్తూ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఆ రాష్ట్ర హోం శాఖా మంత్రి విచార‌ణ‌కు ఆదేశించిన విష‌యాన్ని ప్ర‌క‌టించారు.

రాజారెడ్డి మీసంలో వెంట్రుకకి కూడా సరిపోవు

జగన్ తో పోటీ కష్టం బాబూ