సుశాంత్ నటించిన లేటెస్ట్ సినిమా ఇచ్చట వాహనములు నిలుపరాదు. ఈ మధ్యకాలంలో విడుదలకు ముందే ప్రాఫిట్ తో విడుదలవుతున్న చిన్న సినిమాల్లో ఇది ఒకటి.
ఈ సినిమా నాన్ థియేటర్ బిజినెస్ ఏడు కోట్ల వరకు చేసుకున్నారు. సినిమాకు ఆరు కోట్లకు కాస్త అటుగా ఖర్చు అయింది. అందుకే థియేటర్లలో నేరుగా విడుదల చేసుకుంటున్నారు. ఏ మాత్రం వచ్చినా వచ్చినట్లే.
హిందీ డబ్బింగ్ ను సోనీకి, డిజిటల్ రైట్స్ ఆహా కు,. శాటిలైన్ ను ఒక పెద్ద చానెల్ కు విక్రయించేసారు. నైజాంలో ఆసియన్ సినిమాస్ ద్వారా విడుదల చేసుకుంటున్నారు. ఆంధ్ర సీడెడ్ ల్లో అన్నపూర్ణ ద్వారా విడుదల చేస్తున్నారు.
దర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై సుశాంత్ చాలా ధీమాగా వున్నాడు. ఇది క్లిక్ అయితే మరిన్ని సినిమాలు చేతిలోకి వస్తాయి.