Advertisement

Advertisement


Home > Movies - Movie News

తెరపైకి హరనాధ్ వారసుడు

తెరపైకి హరనాధ్ వారసుడు

ఈ జనరేషన్ కు పరిచయం లేకపోవచ్చు కానీ ముందు తరానికి హీరో హరనాధ్ పేరు పరిచయమే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలో మంచి అందమైన హీరోగా పేరు. తక్కువ కాలంలోనే మంచి సినిమాలు చేయడం, కనుమరుగు కావడం జరిగిపోయింది. దానికి బోలెడు కారణాలు కూడా వినిపిస్తుంటాయి.

ఆ సంగతి అలా వుంచితే ఆ హరనాధ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు 'విరాట్ రాజ్' తెరపైకి వస్తున్నాడు. వెంకట సుబ్బరాజు కూడా అప్పట్లో కొన్ని సినిమాల్లో నటించారు. ప్రస్తుతం విరాట్ రాజ్ పరిచయం అవుతున్న చిత్రం పేరు 'సీతామనోహర శ్రీరాఘవ'. 

‘సీతామనోహర శ్రీరాఘవ' చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇది సరైన చిత్రంగా భావిస్తున్నాను. మీడియా, చిత్ర పరిశ్రమలోని పెద్దలు, ప్రేక్షకులు ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

'విరాట్ రాజ్' ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న దుర్గా శ్రీ వత్సస.కె. మాట్లాడుతూ...'హీరోగా విరాట్ రాజ్ పరిచయం అవుతున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా నేనూ పరిచయం కావడం సంతోషంగా ఉంది.అన్నారు.  కె.జి.ఎఫ్. 2, సలార్ చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్న 'రవి బసూర్' ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?