సోష‌ల్ మీడియాకు అగ్ర‌శ్రేణి హీరోయిన్‌ షాక్‌

సోష‌ల్ మీడియాకు అగ్ర‌శ్రేణి హీరోయిన్ త్రిష షాక్ ఇచ్చారు. ఏమైందో తెలియ‌దు కానీ, ఆమె కొంత కాలం పాటు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యాన్ని ఆమె తాజాగా వెల్ల‌డించారు. దీంతో…

సోష‌ల్ మీడియాకు అగ్ర‌శ్రేణి హీరోయిన్ త్రిష షాక్ ఇచ్చారు. ఏమైందో తెలియ‌దు కానీ, ఆమె కొంత కాలం పాటు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యాన్ని ఆమె తాజాగా వెల్ల‌డించారు. దీంతో నెటిజ‌న్లు, అభిమానులు నిరాశ‌కు గుర‌వుతున్నారు.

తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు త్రిష‌. మూడు ప‌దుల వ‌య‌సు దాటినా వ‌న్నె త‌గ్గ‌ని అందం త్రిష సొంతం. సినీ రంగంలో అడుగు పెట్టిన మొద‌టి రోజుల్లో ఏ గ్లామ‌ర్‌తోనైతే అభిమానుల‌ను ఆకర్షించారో ఇప్ప‌టికీ అట్లే కొన‌సాగిస్తుండ‌డం త్రిష ప్ర‌త్యేక‌త‌.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల‌తో ముచ్చ‌ట్లాడే ఈ సొగ‌సరి  ఒక్క‌సారిగా మ‌న‌సు మార్చుకున్నారు. సోష‌ల్ మీడియాకు బ్రేకప్ చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా త్రిష వెల్ల‌డించారు.

‘ప్ర‌స్తుతానికి నా చుట్టుప‌క్క‌ల ఏం జ‌రుగుతుందో నాకు తెలియాల‌ని అనుకోవ‌డం లేదు. మన మ‌న‌సుకు ఇది డిజిట‌ల్ చికిత్స‌లాంటిది. లవ్ యు గ‌య్స్‌.. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ క‌లుద్దాం’’ అని త్రిష వెల్ల‌డించారు. అంటే చుట్టుప‌క్క‌ల జ‌రుగుతున్న విష‌యాలు ఆమె మ‌న‌సును క‌ల‌త‌కు గురి చేస్తున్నాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

అజ్ఞానానికి మించిన సౌఖ్యం లేద‌ని పెద్ద‌లు చెబుతారు. ఈ లోకంలో ఏం జ‌రుగుతున్న‌దో ఏమీ తెలియ‌క‌పోవ‌డ‌మే మంచిద‌నే నిర్ణ‌యానికి త్రిష వ‌చ్చిన‌ట్టుంది. త‌న అంద‌చందాల‌తో అల‌రించే త్రిష చివ‌రికి సోష‌ల్ మీడియాకు కూడా షాక్ ఇచ్చింది. బ‌హుశా ఈ ప‌రిణామాల‌ను సోష‌ల్ మీడియా అస‌లు ఊహించి ఉండ‌దు. 

బాబు లోకేష్.. వణుకు పుడుతోందా?

లోకేష్ చిప్పకూడుమీద ఆశపడుతున్నాడు