వకీల్ సాబ్ పని పూర్తిచేసిన పవన్ కల్యాణ్

వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి పవన్ ఇవాళ్టితో తన పని మొత్తం పూర్తిచేశాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసిన పవన్, ఇవాళ్టితో సినిమా డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశాడు. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు…

వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి పవన్ ఇవాళ్టితో తన పని మొత్తం పూర్తిచేశాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసిన పవన్, ఇవాళ్టితో సినిమా డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశాడు. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఓ కొలిక్కి వచ్చినట్టయింది.

పవన్ కాకుండా మిగతా నటీనటుల డబ్బింగ్ పనులన్నీ ఇది వరకే పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి. మరో 4 రోజుల్లో వకీల్ సాబ్ ఫస్ట్ కాపీ రెడీ అయ్యే ఛాన్స్ ఉంది. డబ్బింగ్ పూర్తయిన సందర్భంగా పవన్ తో దిగిన ఫొటోల్ని యూనిట్ షేర్ చేసింది.

మరోవైపు ట్రయిలర్ విడుదలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోమవారం ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ అవుతుంది. ట్రయిలర్ కోసం ఇప్పుడు కొత్తగా చేసేదేం లేదు. గతేడాది లాక్ డౌన్ టైమ్ లోనే ట్రయిలర్ రెడీ అయింది. డిసెంబర్ లో రిలీజ్ చేద్దామనుకొని వాయిదా వేశారు. దాన్నే 29వ తేదీన వదలబోతున్నారు.

శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. కొత్తగా యాడ్ చేసిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మాత్రమే శృతిహాసన్ కనిపిస్తుంది. అసలు కథ మొత్తం నివేత థామస్, అంజలి, అనన్య చుట్టూ తిరుగుతుంది.