కేబినెట్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం పడిపోతుందా?

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేపట్టింది కానీ, కేబినెట్ ను మాత్రం ఏర్పరచలేకపోతూ ఉంది. కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో అధికారం భారతీయ జనతా పార్టీకి దక్కిన సంగతి తెలిసిందే. సంకీర్ణ…

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేపట్టింది కానీ, కేబినెట్ ను మాత్రం ఏర్పరచలేకపోతూ ఉంది. కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో అధికారం భారతీయ జనతా పార్టీకి దక్కిన సంగతి తెలిసిందే. సంకీర్ణ ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు రెబెల్స్ గా మారడం, ప్రభుత్వాన్ని కూల్చేయడంతో బీజేపీకి అవకాశం ఇచ్చారు గవర్నర్.

యడ్యూరప్ప మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లలో ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కర్ణాటక అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు ముగిశాకా సీఎంగా ఎన్నికై ఆయన కొన్ని గంటలు మాత్రం పదవిలో కొనసాగగలిగారు. ఆ తర్వాత బలనిరూపణ చేసుకోలేక రాజీనామా చేశారు.

ఇక ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికైతే అయ్యారు కానీ, ఇంతకీ కేబినెట్ ఏర్పాటు ఎప్పుడు? అనేది చర్చనీయాంశంగా మారింది. రెబెల్స్ పై అనర్హత వేటు పడటంతో అసెంబ్లీలో సభ్యుల సంఖ్య తక్కువ అయ్యింది. దీంతో ఉన్న వారితోనే బలనిరూపణ అయితే చేసుకున్నారు యడ్యూరప్ప.

అయితే ఇప్పుడు కేబినెట్లో ఎవరికి చోటు ఇవ్వాలి? ఎవరికి నో చెప్పాలి? అనేది తేల్చడం అంత తేలికగా లేదట. ఎలాగూ ఉన్నది తక్కువ మెజారిటీనే. కాబట్టి కేబినెట్ ను ఏర్పాటు చేయగనే అసంతృప్తులు తయారు అవుతారు. తమకు మంత్రి పదవులు దక్కకపోతే తిరుగుబాటుకు అనేకమంది ఎమ్మెల్యేలు రెడీ అంటున్నారట. ఉన్న మెజారిటీనే బోటాబోటీ.

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కేబినెట్ ఏర్పాటే యడ్యూరప్పకు పెద్ద పరీక్షగా మారిందట. దీంతో కేబినెట్ ఏర్పాటును వాయిదా వేసుకుంటూ పోతున్నారని తెలుస్తోంది. ఆ ముచ్చట అయిపోగానే కమలం పార్టీలో కూడా ముసలం పుట్టి ప్రభుత్వాన్ని ఇరకాటంలోపెట్టే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.

అలాంటి జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కోటలు కూలిపోయాయి

అడవిశేష్ తో రెజీనా స్పెషల్ చిట్ చాట్