జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. నాకు రాజకీయ బిక్ష పెట్టింది హరికృష్ణ అయితే తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా సీటు ఇప్పించింది మాత్రం జూ. ఎన్టీఆర్ నే అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో విభేదాలు ఉన్న కూడా ఎప్పుడు కూడా ఒక మాట కూడా చెడుగా మాట్లాడలేదన్నారు.
నాకు రాజకీయ బిక్ష పెట్టింది హరికృష్ణనే తప్పా చంద్రబాబు కాదన్నారు. చంద్రబాబు ఒక బిచ్చగాడు, 420 అని.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన దొంగ చంద్రబాబు అంటూ హట్ కామెంట్లు చేశారు. చంద్రబాబుకు రాజకీయ జీవితాన్ని ఎన్టీఆర్ ఇచ్చారని అలాంటి వ్యక్తిని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది అని అన్నారు. ఇప్పుడు కూడా అమరావతి రైతుల ముసుగులో జూనియర్ ఎన్టీఆర్ను తిట్టిస్తున్నారంటూ మండిపడ్డారు.
సీనియర్ ఎన్టీఆర్ చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే చంద్రబాబును అల్లుడుగా చేసుకోవడం, బాలకృష్ణ లాంటి వారికి అస్తులు ఇవ్వడం పెద్ద తప్పన్నారు. అందరి కలిపి ఎన్టీఆర్ ను హోరంగా ఆవమానించి ఇప్పుడు దొంగ డ్రామాలు అడుతున్నరంటూ మండిపడ్డారు. తోడు కోసం ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు తప్ప ఆమెకి ఎన్టీఆర్ ఎలాంటి పదవులు ఇవ్వలేదన్నారు. తండ్రి చనిపోయిన తరువాత కూడా వదలరా..? ఇప్పటికీ హింసిస్తూనే ఉంటారా అంటూ.. బాలకృష్ణపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు.
చంద్రబాబు, పవన్ డ్రామాలను ప్రజలు చూస్తున్నారని, ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేందుకు అమరావతి పేరిట యాత్రలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం అమరావతి అనేది ఒక వర్గం వారి మేలుకు మాత్రమే అని, అందుకే ప్రజలు ఎవరు నమ్మడం లేదన్నారు.