ఆడికేమో ‘చిన్నది’..ఆమె కేమో ‘పెద్దది’

తెలుగు సినిమా మారుతోంది. కొత్త పుంతలు తొక్కుతోంది. బయటకు చర్చించలేని సంగతులు తెరపై డిస్కస్ చేయడానికి మొహమాటపడడం లేదు. మాంచి రొమాంటింగ్ నవల రచయిత మేర్లపాక మురళి కుమారుడు మేర్లపాక గాంధీ. కానీ తండ్రి…

తెలుగు సినిమా మారుతోంది. కొత్త పుంతలు తొక్కుతోంది. బయటకు చర్చించలేని సంగతులు తెరపై డిస్కస్ చేయడానికి మొహమాటపడడం లేదు. మాంచి రొమాంటింగ్ నవల రచయిత మేర్లపాక మురళి కుమారుడు మేర్లపాక గాంధీ. కానీ తండ్రి స్టయిల్ లో రొమాంటిక్ సినిమాలు తీయకుండా కామెడీ సినిమాలు తీసి సక్సెస్ సాధించాడు.

ఇప్పుడు అదే డైరక్టర్ తండ్రి స్టయిల్ లో ఓ అడల్ట్ టచ్ కామెడీ సినిమాను చేస్తున్నాడు. తన అంగం సైజ్ చిన్నది అనుకునే హీరో, అలాంటి వాడు ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం, ఫస్ట్ నైట్ వాయిదా వేస్తూ వుండడం, వాటిల్లోంచి పుట్టే ఫన్. ఇదీ సినిమా లైన్ అని తెలుస్తోంది.

యువి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 16 లేదా 23న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారంలో కూడా కొత్త పుంతలు తొక్కేలా వున్నారు. ప్రచారం మొత్తం ఈ 'సైజు' చుట్టూ తిప్పుతున్నారు. 'డజ్ సైజ్ మ్యాటర్' అనే క్యాప్షన్ రాసి వున్న టీ షర్ట్ లు ధరించి, హీరో, హీరోయిన్ల ఇద్దరూ చేతులతో సైజు కొలతలు చూపిస్తూ ఫోటోలు దిగి ప్రమోట్ చేస్తున్నారు. 

మొత్తానికి సినిమానే కాదు, ప్రచారం, స్టిల్స్ అన్నీ ఈ సైజు చుట్టూనే తిరిగేలా వుంది వ్యవహారం చూస్తుంటే..