మంచి భాగస్వామి కోసం కాజల్ వెయిటింగ్

కాజల్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని అంతా వెయిటింగ్. అటు కాజల్ కూడా మంచి భాగస్వామి కోసం వెయిట్ చేస్తోంది. కాకపోతే అంతా అనుకుంటున్నట్టు జీవిత భాగస్వామి కోసం మాత్రం కాదు. మంచి నిర్మాణ…

కాజల్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని అంతా వెయిటింగ్. అటు కాజల్ కూడా మంచి భాగస్వామి కోసం వెయిట్ చేస్తోంది. కాకపోతే అంతా అనుకుంటున్నట్టు జీవిత భాగస్వామి కోసం మాత్రం కాదు. మంచి నిర్మాణ భాగస్వామి కోసం ఆమె ఎదురుచూస్తోంది. అవును.. మంచి పార్టనర్ దొరికితే మూవీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలనేది కాజల్ ఆలోచన.

ఏకే వెంచర్స్ పేరిట ఇప్పటికే ఓ నిర్మాణ సంస్థను రిజిస్టర్ చేయించింది కాజల్. కాకపోతే ఆ బ్యానర్ పై సోలో ప్రొడ్యూసర్ గా కాకుండా మరో పార్టనర్ ను కూడా కలుపుకొని సినిమాలు నిర్మించాలనేది ఆమె ఆలోచన. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు రిస్క్ కూడా తగ్గుతుందనేది ఆమె ఆలోచన.

తమన్నతో కలిసి ఆమె నిర్మాణం రంగంలోకి దిగే అవకాశం ఉందంటూ గతంలో వార్తలొచ్చాయి. కానీ అలాంటిదేం లేదని స్పష్టంచేసింది కాజల్. మరో మంచి పార్టనర్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపింది. కాజల్ నిర్మాతగా మారాలనుకుంటే ప్రస్తుతం 2 ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి.

తేజ చెప్పిన ఓ కథతో పాటు దర్శకుడు ప్రశాంత్ వర్మతో మరో సినిమాపై చర్చలు కొనసాగిస్తోంది కాజల్. వీటిలో ఏదో ఒక సినిమాను ఆమె పిక్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి నిర్మాతగా మారే ఆలోచన లేదని, నటనపైనే పూర్తిగా దృష్టిపెడుతున్నానని ఆమె చెప్పుకొచ్చింది. దీనికి కారణం మంచి నిర్మాణ భాగస్వామి దొరక్కపోవడమే.

అయితే భవిష్యత్తులో తను సినిమాలు నిర్మించడం మాత్రం పక్కా అంటోంది కాజల్. తన మనసుకు నచ్చిన కథల్లో, తనే నటిస్తూ స్వీయ నిర్మాణంలో సినిమాలు చేస్తానని స్పష్టం చేసింది. సీత సినిమా ఫ్లాప్ అవ్వడం తనకు ఎలాంటి బాధ కలిగించలేదన్న కాజల్, ప్రస్తుతం తన దృష్టి మొత్తం రణరంగం సినిమాపైనే ఉందని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో ఆమె డాక్టర్ గా నటించింది.

అలాంటి జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కోటలు కూలిపోయాయి

అడవిశేష్ తో రెజీనా స్పెషల్ చిట్ చాట్