ఆర్ఆర్ఆర్ ప్లాన్ కు కేజిఎఫ్ బ్రేక్

కరోనా పరిస్థితుల కారణంగా సినిమాల విడుదల సమస్యలు మామూలుగా లేవు. సినిమాల విడుదలకు పరిస్థితులు అనుకూలంగా లేవు. సరైన డేట్ గురించి ఆలోచిస్తే పోటీ మరీ దారుణంగా వుంటోంది.  Advertisement పోటా పోటీగా సినిమాలు…

కరోనా పరిస్థితుల కారణంగా సినిమాల విడుదల సమస్యలు మామూలుగా లేవు. సినిమాల విడుదలకు పరిస్థితులు అనుకూలంగా లేవు. సరైన డేట్ గురించి ఆలోచిస్తే పోటీ మరీ దారుణంగా వుంటోంది. 

పోటా పోటీగా సినిమాలు పడిపోతున్నాయి. అక్టోబర్ 13న రావాల్సిన రాజమౌళి-ఎన్టీఆర్, చరణ్ ల ఆర్ఆర్ఆర్ వాయిదా అని వార్తలు వచ్చేసాయి. రిపబ్లిక్ డే నాడు లేదా ఉగాదికి విడుదల అని టాక్ బలంగా వినిపించింది.

ఇలాంటి నేపథ్యంలో మరో పాన్ ఇండియా సినిమా కేజిఎఫ్ కొత్త డేట్ ప్రకటించింది. ఏప్రిల్ 22 విడుదల అంటూ అనౌన్స్ చేసేసింది. దీంతో ఇఫ్పుడు ఆర్ఆర్ఆర్ మళ్లీ ఆలోచించుకోవాలి. ఉగాది ఏప్రిల్ 2న. ఆ డేట్ కు వస్తే కేవలం రెండు వారాల్లో కేజిఎఫ్ వచ్చి పడుతుంది. 

అందువల్ల జనవరిలోనా? లేక మార్చి రెండో సగంలోనా? అన్నది డిసైడ్ చేసుకోవాల్సి వుంటుందేమో? ఇప్పటి వరకు కరోనా థర్డ్ వేవ్ సూచనలు లేవు. అంతవరకు టాలీవుడ్ అదృష్టమే. 

అలా కాకుండా నవంబర్, డిసెంబర్ వేళలో మళ్లీ కోవిడ్ అంటూ హడావుడి మొదలైతే, ఇక జనవరి సినిమాల నుంచి అన్నీ తలపట్టుకోవాల్సిందే.