తాలిబన్లే పాలించనీ… కానీ…?

తాలిబన్లు ఇపుడు ప్రపంచ జనాభా మెదళ్ళలో ఉన్నారు. వారు అఫ్ఘ‌నిస్తాన్ నే కాదు మనిషి అన్న వారి ఆలోచనల్లో అధిక భాగం ఆక్రమించేశారు. భయం, వణుకు ఇపుడు విశ్వంలో అణువణువూ కనిపిస్తున్నాయి. Advertisement దీనికంతటికీ…

తాలిబన్లు ఇపుడు ప్రపంచ జనాభా మెదళ్ళలో ఉన్నారు. వారు అఫ్ఘ‌నిస్తాన్ నే కాదు మనిషి అన్న వారి ఆలోచనల్లో అధిక భాగం ఆక్రమించేశారు. భయం, వణుకు ఇపుడు విశ్వంలో అణువణువూ కనిపిస్తున్నాయి.

దీనికంతటికీ కారణం ఆఫ్ఘన్ పరిణామాలు. టీవీల ముందు కూర్చుని చూసే వారికే అక్కడ దయనీయమైన దృశ్యాలు చూస్తూంటే వెన్నులో చలి పుడుతోంది. మరి ఆ దేశానికి చెందిన వారికి ఎలా ఉంటుంది. విశాఖపట్నం ఏయూలో వంద మంది దాకా ఆఫ్ఘాన్ విద్యార్ధులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు.

వారు తమ దేశంలో ప్రస్తుత పరిణామాలు చూసి భయ భ్రాంతులు అవుతున్నారు. ఇదంతా అమెరికా చేసిన మోసం అంటూ అగ్రరాజ్యాన్ని తిట్టిపోస్తున్నారు. తమ దేశాన్ని నరకం చేశారని కూడా బాధపడుతున్నారు. తాలిబన్లు గతంలో రాక్షసపాలన చేశారని గుర్తు చేసుకుని ఆవేదన చెందుతున్నారు.

ఏయూలో చదువుకుంటున్న అఫ్ఘాన్ విధ్యార్దులలో అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. తమ దేశంలో జాబ్స్ ఏమవుతాయోనని కలత పడుతున్నారు. తాలిబన్లే పాలించనీ కానీ తమకు ఇపుడు శాంతి కావాలి, ప్రపంచ దేశాలు అంతా కలసి ఆఫ్ఘాన్ కి ఆ వరం ప్రసాదించాలని వారు కోరుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని అఫ్ఘాన్ లో సాధారణ పరిస్థితులు ఉండేలా చూడాలని కూడా కోరుతున్నారు.

మొత్తానికి తాలిబన్లు పెట్టిన మంటతో తాము ఉన్న చోట కూడా ఉండలేకపోతున్నామని ఆఫ్ఘాన్ విధ్యార్ధులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తాలిబన్లు పెట్టిన చిచ్చుతో విలవిలలాడుతున్న అఫ్ఘాన్లు పైకి కనిపించేవారు  అయితే ప్రపంచం లోపల ఇదే బాధను అనుభవిస్తోందని మేధావులు అంటున్నారు. ఆ దేశం చక్కబడేలా చేయాల్సిన బాధ్యత అందరిదీ అని విద్యావేత్తలు అంటున్నారు.