తెలంగాణ రాజకీయం మొత్తం మునుగోడు ఉపఎన్నిక చూట్టూ తిరుగుతోంది. ఈ ఉపఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూన్నారు. తాజాగా మునుగోడు ఉపఎన్నికలపై తన దైన శైలిలో కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. 105 అసెంబ్లీ సీట్లున్న టీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు పోయినంత మాత్రాన పోయేదేమీ లేదన్నారు. కేటీఆర్ మాటలను బట్టి చూస్తుంటే మునుగోడు ఉపఎన్నికల ఫలితాలు ముందుగా ఉహించి కార్యకర్తలతో ఇలా మాట్లాడినట్లు కనిపిస్తోంది.
ఇవాళ తెలంగాణ భవన్ లో నిర్వహించిన టీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై కోమటి రెడ్డి బ్రదర్స్ పై, బీజేపీపై హాట్ కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డిలు కోవర్ట్ రెడ్డిలు అంటూ.. తమ్ముడు కాంట్రాక్ట్ ల కోసం బీజేపీ తరుపున పోటీ చేస్తుంటూ… అన్న విదేశాలకు వెళ్తున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులు నోరు తెరిస్తే గుజరాత్ మోడల్ అంటున్నారని, వాస్తవానికి అదొక బేకార్ మోడల్ అని మంత్రి విమర్శించారు.
కోమటిరెడ్డికి ఇచ్చిన 18వేల కోట్ల కాంట్రాక్టు డబ్బులను మునుగోడు ప్రజల అభివృద్ధికి ఖర్చు చేస్తామని హామి ఇస్తే టీఆర్ఎస్ మునుగోడు ఎన్నికల బరి నుండి తప్పుకుంటామని కేటీఆర్ అన్నారు. పదే పదే తప్పుకుంటాము, ఓడిపోయిన పోయోది ఏమి లేదంటూంటే కేటీఆర్ లో మునుగోడు ఉపఎన్నిక విజయంపై సృష్టత లేనట్లు కనిపిస్తోంది.