విచారణకు నేను సిద్ధం, మీరు సిద్ధమా?

విశాఖ‌లోని దసపల్లా భూముల వ్యవహారంలో త‌న‌పై వ‌చ్చిన అరోప‌ణ‌ల‌కు సమాధానం ఇచ్చారు రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి. త‌ము ఎటూవంటి త‌ప్పులు చేయ‌లేద‌ని, సుప్రీంకోర్టు ఆదేశాల‌నే అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు. ప్రభుత్వ తీసుకున్న‌ నిర్ణయంతో…

విశాఖ‌లోని దసపల్లా భూముల వ్యవహారంలో త‌న‌పై వ‌చ్చిన అరోప‌ణ‌ల‌కు సమాధానం ఇచ్చారు రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి. త‌ము ఎటూవంటి త‌ప్పులు చేయ‌లేద‌ని, సుప్రీంకోర్టు ఆదేశాల‌నే అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు. ప్రభుత్వ తీసుకున్న‌ నిర్ణయంతో 400 కుటుంబాలకు మేలు జరిగిందన్నారు. అది ప్రభుత్వ భూమి కాదన్నారు. ఇందులోనూ లబ్ది పొందింది చంద్రబాబు సామాజిక వర్గం వారేనన్నారు.

విశాఖ‌లో జ‌నం ఎక్కువ‌గా వేరే సామాజ‌కివ‌ర్గం వారు ఉంటే.. భూములు, ఆస్తులు మాత్రం చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గం వారివే ఉన్నాయ‌న్నారు. త‌న‌కు విశాఖ‌లో ఎటువంటి అస్తులు లేవ‌ని, సీత‌మ్మ ధార‌లో మాత్ర‌మే ఒక్క ప్లాట్ ఉంద‌న్నారు. నా ఆస్తుల‌పై సీబీఐ విచార‌ణ‌కు సిద్ధ‌మ‌ని, చంద్ర‌బాబు, రామోజీరావులు సిద్ధ‌మా అని స‌వాల్ చేశారు.

త‌న‌పై అస‌త్య‌ప్ర‌చారాలు చేస్తున్నా మీడియా సంస్ధ‌ల‌కు ధీటుగా త‌ను కూడా మీడియా రంగంలోకి రాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌న‌ మీడియా ఎలా ప‌ని చేస్తుందో చూపిస్తాన‌న్నారు. తన కుమార్తె కుటుంబం నాలుగు దశాబ్దాలుగా వ్యాపారంలో ఉందని… వాళ్లు భూములు కొనుగోలు చేస్తే తనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. చంద్రబాబు కోడలు బ్రాహ్మణి భూములు కొనుగోలు చేస్తే బాలకృష్ణకు ఏం సంబంధం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. 

సీబీఐ విచార‌ణ జ‌రిగితే ఎవ‌రూ జైలుకు వెళ్తారో తెలుస్తుంద‌ని, ఒక్క ఫిలింసిటిలోనే రామోజీరావు 2500 ఎక‌రాల భూమిని అక్ర‌మించుకున్నార‌ని, ప‌చ్చ‌ళ్లు అమ్ముకునే వ్య‌క్తి ల‌క్ష‌ల కోట్లు ఎలా సంపాధించారో స‌మాధానం చెప్పాలన్నారు. మార్గ‌ద‌ర్శి డిపాజిట‌ర్ల‌ను మోసం చేసి సంపాధించిన రామోజీ రావు నాపై త‌ప్పులు రాత‌లు రాస్తునంటూ మండిప‌డ్డారు.