మొన్నటివరకు పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవడం అనేది ఆనవాయితీగా మారింది. కానీ ఇప్పుడు రివర్స్ ట్రెండ్ నడుస్తోంది. ప్రతి సినిమాకు టికెట్ రేట్లు తగ్గించామని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ క్రమంలో ఎఫ్3, మేజర్ లాంటి సినిమాలకు టికెట్ రేట్ల తగ్గింపు కూడా ఓ ప్రచారాస్త్రంగా మారింది. మరి వారం రోజుల్లో విడుదల కాబోతున్న నాని సినిమా పరిస్థితేంటి?
నాని తాజా చిత్రం 'అంటే సుందరానికి'. ఈ సినిమా ప్రమోషన్ కొన్ని రోజుల కిందట స్టార్ట్ అయింది. తాజాగా నాని కూడా రంగంలోకి దిగాడు. ట్రయిలర్ లాంచ్ లో పాల్గొన్నాడు. రేపట్నుంచి వరుసగా ఈవెంట్లు ప్లాన్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో 'అంటే సుందరానికి' యూనిట్ టికెట్ రేట్లపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కింది 'అంటే సుందరానికి' సినిమా. ఇది భారీ బడ్జెట్ సినిమా కాదు. కాబట్టి టికెట్ రేట్ల పెంపు అనే చర్చ లేదు. ఎటొచ్చి ఉన్న రేట్లు తగ్గిస్తారా లేదా అనేదే చర్చ. ఎఫ్3 టైపులో సాధారణ రేట్లకే సినిమాను ప్రదర్శిస్తారా లేక మేజర్ సినిమా టైపులో ఉన్న రేట్లను కూడా కాస్త తగ్గించి విడుదల చేస్తారా అనేది డిస్కషన్ పాయింట్.
మేకర్స్ వైపు నుంచి మాత్రం దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. మరో 2 రోజుల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాబోతున్నాయి. అప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది. ఈ ఏడాది నానికి ఇదే తొలి సినిమా.