మెగాస్టార్ సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా లో హీరో రామ్ చరణ్ కూడా వాటాదారే. నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ లతో పాటు హీరో చరణ్ కూడా వాటాదారుగా వున్నారు. అసలు ఈ సినిమా హక్కులు కొనిపించింది చరణ్ నే.
కొడుకు నిర్మాత అయినా తండ్రి హీరో అయినా రెమ్యూనిరేషన్ విషయంలో పక్కాగా వున్నారని తెలుస్తోంది. విడుదలకు ముందు డెఫిసిట్ లో విడుదలయింది. ఎందుకంటే నాన్ థియేటర్ డబ్బులు పూర్తిగా రాలేదు. అడ్వాన్స్ లు మాత్రమే వచ్చాయి. అలాగే చాలా తక్కువ అడ్వాన్స్ ల మీద సినిమా థియేటర్ హక్కులు ఇచ్చారు.
అయినా కూడా మెగాస్టార్ కు 50 కోట్ల రెమ్యూనిరేషన్ ముందుగానే ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అంతే కాదు సల్మాన్ కు విడుదల తరువాత భారీ గిఫ్ట్ ఇవ్వడం కోసం అయిదు కోట్లు అలాట్ చేసి వుంచినట్లు తెలుస్తోంది. సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చెప్పనే చెప్పారు. రెమ్యూనిరేషన్ ఇవ్వబోతే సల్మన్ తీసుకోలేదని, తరువాత చరణ్ వెళ్లి ఏదో ఒకటి చేస్తాడని చెప్పారు.
ఆ ఏదో ఒకటి ఈ అయిదు కోట్లు అని, అయితే అది. డబ్బు రూపంలో కాకుండా గిఫ్ట్ రూపంలో వుంటుందని తెలుస్తోంది. మొత్తం మీద సినిమా కలెక్షన్లు టాప్ హీరోల రేంజ్ లో లేకపోయినా, మెగాస్టార్ రెమ్యూనిరేషన్ మాత్రం అదే రేంజ్ లో వుంది.
గమ్మత్తేమిటంటే యాభై కోట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ నైజాంలో 30 కోట్లకు లోపే చేసింది. మెగాస్టార్ గాడ్ ఫాదర్ అందులో సగం కూడా చేయడం లేదు.