హంట్ లో…’పాపతో పైలం’

సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'హంట్'. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా నుంచి 'పాపతో పైలం…'…

సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'హంట్'. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా నుంచి 'పాపతో పైలం…' పాటను విడుదల చేశారు. 'పటాకా సాంగ్ ఆఫ్ ది ఇయర్' అంటూ విడుదల చేసిన 'పాపతో పైలం…'లో సుధీర్ బాబుతో పాటు అప్సరా రాణి స్టెప్పులు వేశారు. 

'క్రాక్', 'సీటీమార్' తర్వాత మరోసారి ప్రత్యేక గీతంలో ఆమె సందడి చేశారు. ఇందులో సుధీర్ బాబు, అప్సరా రాణితో పాటు శ్రీకాంత్, భరత్ కూడా డ్యాన్స్ చేశారు. ఈ పాటకు యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. జిబ్రాన్ సంగీతం అందించగా… మంగ్లీ, నకాష్ అజీజ్ ఆలపించారు. 

ఈ సందర్భంగా చిత్రనిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ “సినిమాలో రెండు పాటలు ఉన్నాయి. ఈ రోజు 'పాపతో పైలం' విడుదల చేశాం. దీనికి మంచి స్పందన లభిస్తోంది. సుధీర్ బాబు ఎనర్జీగా, స్టైల్ గా డ్యాన్స్ చేశారని, సాంగ్ బావుందని ఆడియన్స్ చెబుతున్నారు. ఇదొక స్టైలిష్ అండ్ హై  వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేశారు. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని చెప్పారు.