రిజ‌ర్వేష‌న్‌పై సుప్రీం సంచ‌ల‌న తీర్పు

రిజ‌ర్వేష‌న్‌పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం  సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. రిజ‌ర్వేష‌న్ పౌరుల ప్రాథ‌మిక హ‌క్కు ఎంత మాత్రం కాద‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 32 కింద దీన్ని స‌వాల్ చేయ‌లేర‌ని కూడా…

రిజ‌ర్వేష‌న్‌పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం  సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. రిజ‌ర్వేష‌న్ పౌరుల ప్రాథ‌మిక హ‌క్కు ఎంత మాత్రం కాద‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 32 కింద దీన్ని స‌వాల్ చేయ‌లేర‌ని కూడా స్ప‌ష్టంగా పేర్కొంది. ఈ కీల‌క తీర్పుపై దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేసు పూర్వాప‌రాల‌ను ప‌రిశీలిద్దాం.

2020-21కి సంబంధించి గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ వైద్య, దంతవైద్య కోర్సులను నీట్‌ ద్వారా భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే… ఆలిండియా కోటాలో తమిళనాడుకు సంబంధించిన సీట్లను సగం మేర ఓబీసీలకే కేటాయించాలని ఆ రాష్ట్ర‌ సర్కారు నిర్ణయించింది. దీనికి  కేంద్ర స‌ర్కార్ అనుమతి నిరాకరించింది. ఇది వివాదానికి దారి తీసింది.

దీన్ని వ్యతిరేకిస్తూ త‌మిళ‌నాడులో రాజ‌కీయాల‌కు అతీతంగా అన్ని పార్టీలు ఏక‌మ‌య్యాయి. ఆ రాష్ట్రంలోని అన్నాడీఎంకే, డీఎంకే, సీపీఎం, సీపీఐ, తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ న్యాయం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ అంశంలో కేంద్ర ఆరోగ్యశాఖ, భారత వైద్య మండలి, జాతీయ పరీక్షల మండలిని ప్రతివాదులుగా పేర్కొంటూ త‌మిళ‌నాడు నేతలు వైకో, అన్బుమణి రాందాస్‌లు కూడా పిటిష‌న్‌లు వేశారు.

ఈ వ్యాజ్యాల‌పై  జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సంద‌ర్భంగా రిజ‌ర్వేష‌న్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. సుప్రీంకోర్టు చేసిన ఆ వ్యాఖ్య‌లు ఏంటంటే…

‘రిజర్వేషన్‌ ప్రాథమిక హక్కు కాదు. రాజ్యంగంలోని ఆర్టికల్‌ 32 కింద దీనిని సవాలు చేయలేరు’’ అని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్య‌లు దేశం యావ‌త్తు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ఎందుకంటే రాజ‌కీయ పార్టీలు త‌మ రాజ‌కీయ స్వార్థం కోసం రిజ‌ర్వేష‌న్ల‌ను అస్త్రాలుగా వాడుకుంటున్న విష‌యం తెలిసిందే.

ఈ అంశంపై మద్రాస్‌ హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతిస్తూ, పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. ఇదిలా ఉండ‌గా రిజ‌ర్వేష‌న్‌ అంశంపై తమిళనాడు రాజకీయ పక్షాలన్నీ ఏకతాటిపైకి రావడంపై దేశ అత్యున్న‌త ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేయ‌డం గ‌మ‌నార్హం. 

నువ్వు ఎలాంటోడివో మీ అబ్బాయే చెప్పాడు