ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (82) కన్నుమూశారు. గత వారంలో ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్న ఆయన ఇవాళ మరణించారు.
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు అయిన మూలాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు చేశారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్ అయిన ములాయం యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు.
ములాయం1967లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ములాయం మొత్తం 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో నేతాజీగా ప్రాచుర్యం పొందిన ములాయం..యూపీలోనే కాకుండా,దేశ రాజకీయాల్లోనూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.