కొండపొలం.. అన్నీ ఒకేసారి.. ఒకే రోజు

చాన్నాళ్ల కిందటే షూటింగ్ పూర్తయింది. ఇంకా చెప్పాలంటే కరోనా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే షూటింగ్ పూర్తిచేశాడు దర్శకుడు క్రిష్. ఆ తర్వాత అంతే వేగంతో పోస్ట్ ప్రొడక్షన్, `ఫస్ట్ కాపీ కూడా రెడీ…

చాన్నాళ్ల కిందటే షూటింగ్ పూర్తయింది. ఇంకా చెప్పాలంటే కరోనా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే షూటింగ్ పూర్తిచేశాడు దర్శకుడు క్రిష్. ఆ తర్వాత అంతే వేగంతో పోస్ట్ ప్రొడక్షన్, `ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయింది. ఎనీటైమ్ ఓటీటీకి ఇచ్చేయడానికి సిద్ధం చేశారు. కానీ ఆఖరి నిమిషంలో వైష్ణవ్ తేజ్ రెండో సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అలా చాన్నాళ్లుగా అట్టిపెట్టిన ఈ సినిమాకు సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్, సినిమా జానర్.. ఇలా అన్నీ ఒకేసారి రిలీజ్ చేశారు.

శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు క్రిష్-వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా టైటిల్ ను రివీల్ చేశారు. ఈ సినిమాకు కొండపొలం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని గ్రేట్ ఆంధ్ర చాన్నాళ్ల కిందటే బ్రేక్ చేసింది. వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని, సినిమాకు కూడా నవల పేరునే పెట్టినట్టు గతంలోనే వెల్లడించాం. చెప్పినట్టుగానే ఇప్పుడు అదే టైటిల్ తో పోస్టర్ రిలీజ్ చేశారు.

టైటిల్ పోస్టర్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వడిశె తిప్పుతూ యాంగ్రీ లుక్ లో కనిపిస్తున్నాడు వైష్ణవ్ తేజ్. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, జ్ఞానశేఖర్ కెమెరా పనితనం, లైటింగ్ ఈ ఫస్ట్ లుక్ కు అందం తీసుకొచ్చాయి.

వీటితో పాటు మరెందుకు ఆలస్యం అనుకున్నారేమో.. విడుదల తేదీని కూడా ఈరోజే ప్రకటించేశారు. అక్టోబర్ 8న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించాడు. ఓవైపు పవన్ తో హరిహర వీరమల్లు సినిమా సెట్స్ లో ఉంటుండగానే ఈ సినిమాను ఇలా స్టార్ట్ చేసి, అలా కంప్లీట్ చేశాడు క్రిష్.