వైఎస్సార్, జగన్ లు ముఖ్యమంత్రులుగా ఏమి చేయాలన్నా వాళ్ళు దాటాల్సిన అడ్డంకులు అనేకం.. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ఎల్లోమాఫియా రెచ్చిపోవడం మొదలు రాష్ట్రంలో, మరియు పక్క రాష్ట్రాలలో అక్కడి స్థానికులతో కలిసి అలజడులు సృష్టించడం, కేసులు వేయించడం తద్వారా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు అడ్డగించడం లాంటి నీచమైన వ్యవహారాలు.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గానీ న్యాయస్థానాలలో ప్రభుత్వం పైన కేసులు వేసిన దాఖలాలు లేవు.. మా బ్లడ్ వేరు మా బ్రెడ్ వేరు అనేవాళ్ళకు వాళ్ళు అధికారంలో లేకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి స్తంభించిపోవాలని, రాష్ట్ర ప్రగతి ఆగిపోవాలని, ప్రజలు ఇక్కట్లు పడాలనే వాంఛ చాలా ఎక్కువ.. వైఎస్సార్ గాని జగన్ గానీ ప్రజాస్వామ్య పద్ధతిలో అఖండ విజయాలు సాధించినా అదేదో ప్రజలకు అవగాహన లేక పొరబాటున తప్పు జరిగిందన్నట్లు నిస్సిగ్గుగా ప్రచారం చేస్తారు…
బాబుగారూ మీరోడిపోవటమేమిటండీ అనేది వారి వాదన… అంతేగాని రెక్కాడితే గాని డొక్కాడని 75% ఉన్న ప్రజలను పూర్తిగా విస్మరించి సమాజంలో పైనున్న 10 శాతానికి రాష్ట్ర వనరులను దొచిపెట్టడం తప్పనే ఆలోచన మాత్రం కలగకపోవడం చాలా విచిత్రం… రామోజీకైనా తండాలో ఉండే రామా నాయకుకైనా ఒకటే ఓటు ఉంటుందని అవి రెండూ సమానమేననే భావన ఎల్లో ముఠాకు రాదు… ప్రజాస్వామ్య లక్షణాలు పూర్తిగా మరచిపోయి మేము మాత్రమే ఉన్నతులమనే సంస్కృతే తెలుగుదేశం పార్టీ ఓటములకు కారణం..
తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు వ్యవస్థలలో, మీడియాలో ఉన్న తమ మద్దతుదారులతో ఓ మాఫియాగా మారి వాళ్ళు అధికారంలో లేకపోతే వైఎస్సార్ ని కానీ, జగన్ ను కానీ సాధారణ పాలన చేయనీయకుండా తీవ్రమైన అడ్డంకులు సృష్టించినా వాళ్ళిద్దరూ కిందా మీదా పడి ఏటికి ఎదురీది మరీ ప్రజల మన్ననలు పొందటం సామాన్య విషయం కాదు… 2008 లో వైఎస్సార్ మళ్లీ గెలవడం, 2024లో జగన్ మళ్లీ పూర్తి స్థాయిలో గెలుస్తాడని చెప్తున్న అనేక సర్వేలు వైఎస్సార్ జగన్ ల సామాజిక అవగాహనను సూచిస్తున్నాయి.. పైనున్న 10 శాతం మాత్రమే కాదు, కిందున్న 90 శాతం వారి కనీస అవసరాలు కూడా ముఖ్యమనే ఆలోచన వారిద్దరిది.. ఇదే వారిద్దరి అఖండ విజయానికి కారణంగా నిలుస్తోంది…
పెత్తందార్లకు తెలుగుదేశం పార్టీ కాపు కాస్తే, వైఎస్సార్, జగన్ బడుగు వర్గాలకు బలహీనులకు అండగా నిలిచారు, నిలుస్తున్నారు.. చంద్రబాబు లోకేషులు వాళ్ళు పేదల సంక్షేమం కోసమే బతుకుతున్నామని ఎంత మొత్తుకున్నా ప్రజలలో నమ్మకం రాదు ఎందుకంటే ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి చంద్రబాబు ట్రాక్ రికార్డ్ అలాంటిది.. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయింది మోడీ బీజేపీ గాలి వలనే గానీ సొంతంగా కాదు.. అప్పటి తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఓట్ల తేడా కేవలం 1.5%.. ఆ సమయంలో తెలుగుదేశంకి పడిన ఓట్లలో కనీసం 10% ఓట్లు బీజేపీ సానుభూతిపరులవే..
చంద్రబాబు కుట్రలు రంగస్థలం సినిమా కాలానికి పనిచేశాయి.. నేటి సోషల్ మీడియా, వాట్సప్ కాలానికి పనిచేయవు.. ఆయన రాష్ట్రంలోని పేదలకు ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు, తన కొడుకుని మనవడ్ని ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే చదివిస్తాడు.. ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకోవాలని చూసిన తన పచ్చ మాఫియాది (వెంకయ్య నాయుడుతో సహా), న్యాయమూర్తులది ఇదే పరిస్థితి… ఈ విషయంలో ఇప్పటి ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన ఉంది.. అమరావతే రాజధాని విశాఖ వద్దే వద్దనే ఎల్లో మాఫియా ఆంతర్యమేమిటో ప్రజలకు నెమ్మది నెమ్మదిగా అర్థం అవుతోంది.. నాడూ నేడు, వాలంటీర్ల గ్రామ సచివాలయ వ్యవస్థలు, రైతు భరొసా కేంద్రాలు, గ్రామీణ వైద్యం లాంటి ఎన్నో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్వకమైన మార్పులు.. వీటిని ఎల్లో మాఫియా ఎంతగా కప్పిపెట్టాలని చూసినా, ఎంత విషం చిమ్మినా తక్షణ ప్రతిఫలం అందుకుంటున్న ప్రజలకు వాటి విలువ పూర్తిగా తెలుసు.. ఉన్నదాన్ని లేనట్టు లేనిదాన్ని ఉన్నట్టుగా పచ్చ మాఫియా చేసిన కనికట్టు నాడు పనిచేసి ఉండొచ్చు కాని నేడు పనిచేయదు.. నేటి సమాజంలో ప్రజల్లో వచ్చిన చైతన్యం అలాంటిది..
మొన్నటి వరకు జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాల వలన రాష్ట్రంలో ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు, రాష్ట్రం శ్రీలంకవుతుందనే ప్రచారం చేసిన చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ & పవన్ కళ్యాణ్ లతో కూడిన ఎల్లోమాఫియా నేడు ట్యూన్ మార్చి మేము అధికారంలోకి వస్తే జగన్ ఇచ్చే దానికంటే పది రెట్లు ఎక్కువిస్తామనే స్థాయికి వచ్చారు… అయినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. ఎందుకంటే గత ఎన్నికల్లో రుణమాఫీ విషయంలో ప్రజలంతా స్వయంగా చూసిన అనుభవం అలాంటిది…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ అరాచకం ఉందనే రీతిలో ఎల్లో మాఫియా ప్రచారంచేస్తోంది.. పక్కన ఉండే తెలంగాణాలో బతుకుతూ అక్కడే ఆస్తులు కూడబెట్టుకుని, పన్నులు కడుతూ అప్పుడప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చి అరే జగన్ నువ్వెవడివిరా అసలు, ఒరేయ్ సైకో జగన్, మేము వచ్చాక మిమ్మల్ని బట్టలూడదీసి రోడ్ల పైన కొడతామని వాగుతున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ లు ఈ రాష్ట్రంలో నిజంగా అలాంటి అరాచకమే ఉండుంటే వాళ్ళ దవడలు పగిలి మూతి పళ్ళు రాలేవి.. కానీ అలా జరిగిన సంఘటన ఒక్కటైనా ఉందా… ఒకవైపు వీళ్ళే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని ఇతర మంత్రులను ఉద్దేశించి చాలా రోజులుగా ఇలాంటి దుర్భాషలాడుతూ మరోవైపు అరాచకమంటే ప్రజలెలా నమ్ముతారు..!? ఇరుకు సందుల్లో సభలు పెట్టుకుని పదుల సంఖ్యలో కార్యకర్తల ఘోరమైన చావులకు కారణమయ్యి కూడా కోర్టుల్లో స్టేలు తెచ్చుకుని బలాదూరుగా తిరుగుతున్న ఈ తెలుగుదేశం నాయకులపైన ప్రజలలో ఏహ్యభావం తప్ప ఏముంటుంది..!? సమాజంలో వివిధ వర్గాలను రెచ్చగొడుతూ అరాచకం సృష్టిస్తున్నదే వీళ్ళు అనే కనీస జ్ఞానం ప్రజలకు ఉండదనే చులకన భావమే వీళ్ళ ఓటమికి ప్రధాన కారణమవుతుంది… ప్రజల్ని తక్కువ అంచనా వేసిన ఏ పార్టీ, ఏ నాయకుడు గెలిచిన దాఖలాలు లేవు..
చంద్రబాబు, లోకేష్, పచ్చ మాఫియా, పవన్ కళ్యాణ్ ఎంత విషం చిమ్మినా, ఎంత మొత్తుకున్నా ప్రజలలో తమ పట్ల నమ్మకం కలిగించుకోలేరు జగన్ పట్ల వ్యతిరేకత తేలేరు.. తన వారిని రకరకాల వ్యవస్థలలోకి జొప్పించి వారి ద్వారా మేనేజ్ చేసినట్టు ప్రజలను కూడా మేనేజ్ చెయ్యడం ప్రజాస్వామ్యంలో కష్టం… 2024 లో జగన్మోహన్ రెడ్డి అఖండ విజయాన్ని, ఆయన నేతృత్వంలో రాష్ట్ర ప్రగతిని వీళ్ళెవ్వరూ అడ్డుకోలేరనేది మాత్రం అందరి మాట.
గురవా రెడ్డి, న్యూ యార్క్