పవన్ కి పాదయాత్ర అసాధ్యమా…?

ఆయన వెండితెర మీద పవర్ స్టార్. అక్కడ రీల్ లైఫ్ లో ఆయన చేసే మ్యాజిక్కులు వేరే లెవెల్ లో ఉంటాయి. ఇల రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత. ఆయన…

ఆయన వెండితెర మీద పవర్ స్టార్. అక్కడ రీల్ లైఫ్ లో ఆయన చేసే మ్యాజిక్కులు వేరే లెవెల్ లో ఉంటాయి. ఇల రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత. ఆయన పార్టీ పెట్టి ఎనిమిదేళ్ళు అయింది. ఇన్నేళ్ళలో పవన్ రాజకీయాలను పార్ట్ టైమ్ గానే చేశారు అన్న విమర్శలు ప్రత్యర్ధి పార్టీలు చేస్తూనే ఉంటాయి.

ఇక 2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. ఆ తరువాత మూడేళ్ళు గడిచాయి. ఈ మధ్యకాలంలో పార్టీని పటిష్టపరచే కార్యక్రమం పవన్ ఏమైనా చేశారా అంటే పెద్దగా లేదు అనే అంటారు అంతా. ఇక ఏపీలో ఎన్నికల ఫీవర్ మొదలైంది. దాంతో పాదయాత్రలు సైకిల్ యాత్రలు, బస్సు యాత్రలు అంటూ టీడీపీ ఫీలర్స్ వదులుతోంది. మరి జనసేన సంగతేంటి అని విశాఖ వచ్చిన మెగాబ్రదర్ నాగబాబుని మీడియా అడిగింది.

దానికి ఆయన బదులిస్తూ పవన్ కళ్యాణ్ తో పాదయాత్రనా అది  అసాధ్యమని తేల్చేశారు. పాదయాత్ర కంటే అంతే ఇంపాక్ట్ ఇచ్చేదిగా ఉండే యాత్ర ఏదో ఒకటి తమ పార్టీ డిజైన్ చేస్తుందని మాత్రం చెప్పారు. అంటే పవన్ బస్సు యాత్ర రూపంలో జనాల్లోకి వస్తారా లేక అన్న ఎన్టీయార్ మాదిరిగా చైతన్య రధమేసుకుని ఏపీ అంతా తిరుగుతారా అన్నదే చూడాలి.

ఇక రాజకీయాల్లో ప్రజలను చేరాలి అంటే డైరెక్ట్ కనెక్షన్ గా పాదయాత్రనే అంతా ఎంచుకుంటారు. అలాంటి పాదయాత్ర అసాధ్యమని జనసేన నాయకులు అంటున్నారు. పవన్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న వారు పాదయాత్ర చేస్తే కష్టం, జనాలు ఊరుకోరు, ట్రాఫిక్ జామ్అవుతుంది అన్నది జనసేన ఆలోచనగా ఉందిట.

కానీ ప్రజల కోసం ఇలాంటి రిస్కులు భరించి అయినా నాయకులు  చేస్తేనే కదా వారి ఆదరణ పూర్తిగా దక్కేది అని అంటున్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా పవన్ ఏదో ఒక యాత్ర అయితే త్వరలో చేపడతారు అని నాగబాబు చెప్పారు. అది ఎపుడూ అన్నదే జనాలు చూడాలి.