మహేష్ ఫస్ట్ లుక్-విజయశాంతి ఎంట్రీ

సరిలేరునీకెవ్వరు సినిమా సూపర్ ఫాస్ట్ గా రెడీ అవుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి చకచకా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. ఈ సినిమా హీరో మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ను శుక్రవారం…

సరిలేరునీకెవ్వరు సినిమా సూపర్ ఫాస్ట్ గా రెడీ అవుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి చకచకా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. ఈ సినిమా హీరో మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ను శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు విడుదల చేస్తున్నారు. పూర్తి మిలటరీ గెటప్ కాకుండా, అలా అని కాజువల్ లుక్ కాకుండా వుండే స్టిల్ ను వదులుతున్నారు. అయితే స్టిల్ చూడగానే మిలటరీ మేజర్ అని అనిపించేలాగే వుంటుంది.

ఈ స్టిల్ మాత్రమే రేపటి స్పెషల్ కాదు. కొన్ని ఏళ్లుగా సినిమాలకు దూరంగా వున్న సీనియర్ హీరోయిన్ విజయశాంతి మళ్లీ మేకప్ వేసుకుని రేపు షూటింగ్ లో పాల్గోబోతున్నారు. రేపటి నుంచి నుంచి రెండు మూడు రోజులపాటు విజయశాంతి కాంబినేషన్ సీన్లు చిత్రీకరిస్తారు.

ఈ సీన్లు వున్నందున, ట్రయిన్ కామెడీ సీన్లకు బ్రేక్ ఇచ్చారు. అవి మళ్లీ 12 నుంచి షూట్ చేస్తారు. మహేష్ ఫస్ట్ లుక్, విజయశాంతి షూటింగ్ కు రావడం మాత్రమేకాదు, మరో సర్ప్రయిజ్ కూడా రేపు వుంటుందని తెలుస్తోంది.

అధికారంతో వైఎస్సార్సీపీ, ఆరాటంతో బీజేపీ