టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ నేటితో 60వ ఏడాదిలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు, చెబుతున్నారు. బాలయ్య ముద్దుల అల్లుడు లోకేశ్ మాత్రం ముద్దుల మామను మురిపించేలా బర్త్‌డే విషెస్ చెప్పాడు. బాలయ్యకు శుభాకాంక్షలు చెబుతూ లోకేశ్ చేసిన స్వీట్ ట్వీట్ ఏంటంటే…
‘‘అందరికీ ఆయన బాలయ్య. నా ఒక్కడికీ ఆయన ముద్దుల మావయ్య. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచే కథానాయకుడు ఆయన. బాలా మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే షష్టిపూర్తి మహోత్సవ అభినందనలు. నిన్న బాలా మావయ్య కొత్త సినిమా టీజర్ చూసాను. చాలా ఎనర్జిటిక్‌గా కనిపించారు. మావయ్యా… మీరు మరెన్నో చిత్రాల్లో నటించి… మీ అభిమానులకు ఎప్పటిలాగే సంచలన విజయాలను కానుకగా ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను’’ అని లోకేష్ ట్వీట్ చేశాడు.
బాలయ్య పెద్ద కుమార్తె బ్రహ్మణిని లోకేశ్ వివాహమాడిన విషయం తెలిసిందే. అందుకే లోకేశ్ స్ట్రెస్ చేసి మరీ…నా ఒక్కడికీ ఆయన ముద్దుల మావయ్య అని ప్రకటించడం. ఇంతకూ బాలయ్య మామకు ముద్దుల అల్లుడు ట్వీట్‌తో సరిపెట్టాడా లేక ఇంటికెళ్లి నేరుగా శుభాకాంక్షలు చెప్పాడా లేదా? ప్రతి దానికి ట్విటర్ ఉంది కదా అని అక్కడి నుంచే అన్నీ సరిపెట్టాలని లోకేశ్ భావిస్తున్నాడా? ఎందుకంటే తనొక్కడికే ముద్దుల మావయ్య అని ప్రకటించుకుని, అందరిలా సోషల్ మీడియాలో శుభాకాంక్షలతో సరిపెడితే అంత బాగుండదేమో!
అందరికీ ఆయన బాలయ్య. నా ఒక్కడికీ ఆయన ముద్దుల మావయ్య. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచే కథానాయకుడు ఆయన. బాలా మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు షష్టిపూర్తి మహోత్సవ అభినందనలు(1/2)#HappyBirthdayNBK pic.twitter.com/Mh7CLDo3sT
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) June 10, 2020