లోకేష్ నాయకత్వాన్ని ఒప్పుకోరా ?

తెలుగుదేశానికి ఒకే ఒక ఆశాకిరణం లోకేష్ బాబు. ఆయన చంద్రబాబు రాజకీయ వారసుడు. భావి తెలుగుదేశ రధసారధి. ఇది అధినాయకుని ఆలోచన మాత్రమేనని పచ్చ పార్టీలో ఎవరూ లోకేష్ నాయకత్వాన్ని అసలు అంగీకరించే ప్రసక్తే…

తెలుగుదేశానికి ఒకే ఒక ఆశాకిరణం లోకేష్ బాబు. ఆయన చంద్రబాబు రాజకీయ వారసుడు. భావి తెలుగుదేశ రధసారధి. ఇది అధినాయకుని ఆలోచన మాత్రమేనని పచ్చ పార్టీలో ఎవరూ లోకేష్ నాయకత్వాన్ని అసలు అంగీకరించే ప్రసక్తే లేదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఢంకా భజాయిస్తున్నారు.

లోకేష్ ని మోసేందుకు తమ్ముళ్ళు సిధ్ధంగా లేరు బాబూ అంటున్నారు. మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ పెత్తనం చేస్తానంటే సీనియర్లు సహా ఎవరు ఊరుకుంటారని కూడా అవంతి బాబుని నిలదీస్తున్నారు.

లోకష్ మా నాయకుడు అని మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ లాంటి చేత బాబు అనిపించగలరా అని సవాల్ చేస్తున్నారు. అంటే గంటాకు లోకేష్ భావి అధినేత కావడం నచ్చదని ఆయన నిన్నటి స్నేహితుడు ముత్తంశెట్టి చెప్పడం విశేషమే.

ఎన్నికలో ఘోరపరాజయం పాలు అయిన తరువాత చంద్రబాబు, లోకేష్ బాబు మాట్లాడుతున్న మాటలు బ్యాలన్స్ తప్పేస్తున్నాయని కూడా అవంతి హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ముందు మీ మైండ్ సెట్ మారుకోండి బాబులూ అంటూ సలహా కూడా ఇస్తున్నారు.

సరే వైసీపీ  మంత్రి కాబట్టి ఆయన అలా టీడీపీ మీద  విమర్శలు చేశారనుకున్నా లోకేష్ బాబు పెత్తనాన్ని టీడీపీలో ఎవరూ అంగీకరించే ప్రసక్తి లేదని  గట్టిగా అంటున్నారంటే  మాజీ తమ్ముడిగా  పచ్చ పార్టీలో  ముసలాన్ని సరిగ్గానే ఊహిస్తున్నారనుకోవాలా.

జన్వాడ ఫామ్ హౌస్ రహస్యాలు

జగన్ గారికి చాలా థాంక్స్