భూములు తీసుకుంటే కాదు…

విశాఖ నిజంగా సినిమాలకు అనుకూలం. ఎపుడో అరవయి దశకంలోనే సినిమా షూటింగులు విశాఖలో మొదలయ్యాయి. అవుట్ డోర్ రూట్ కు సినీ కెమెరా పట్టగానే అందరికీ మొదట  గుర్తుకు వచ్చింది విశాఖ మాత్రమే. Advertisement…

విశాఖ నిజంగా సినిమాలకు అనుకూలం. ఎపుడో అరవయి దశకంలోనే సినిమా షూటింగులు విశాఖలో మొదలయ్యాయి. అవుట్ డోర్ రూట్ కు సినీ కెమెరా పట్టగానే అందరికీ మొదట  గుర్తుకు వచ్చింది విశాఖ మాత్రమే.

అక్కినేని నాగేశ్వరరావు కులగోత్రాలు సినిమా షూటింగ్ పార్ట్ పాటలు విశాఖలో అప్పట్లో షూట్ చేశారు. ఆ తరువాత విశాఖ ఖ్యాతి పెంచింది దివంగత దర్శకుడు కె బాలచందర్ అని చెప్పాలి. ఆయన మరో చరిత్రతో విశాఖ సినీ చరిత్ర కూడా మార్చేశారు.

విశ్వనాధ్, దాసరి నారాయణరావు వంటి వారు ఎందరో విశాఖలో షూటింగులు చేశారు. రాఘవేంద్రరావు, భారతీరాజా వంటి ఉద్దండులకు కూడా విశాఖ తెగ నచ్చింది. అటువంటి విశాఖను సినీ రాజధాని చేయాలన్నది దశాబ్దాల కోరిక. ఎందరో ముఖ్యమంత్రులు ప్రయత్నం చేసినా సాకారం కాలేదు. ఇపుడు జగన్ విశాఖ మీద ప్రత్యేక ద్రుష్టి పెట్టారు. ఆయన పాలనారాజధాని అంటున్నారు.

అలాగే విశాఖను సినీ రాజధాని చేస్తామని పట్టుదల మీద ఉన్నారు. జగన్ ఉదారంగా ఇక్కడ భూములలో సినీ యాక్టివిటీని పెంచాలనుకుంటున్నారు. మరి సినీపరిశ్రమ తరలిరావాలంటే  భూములు తీసుకోవడంతో జరిగేది కాదు, వారు ఇక్కడ స్టూడియోలు కట్టాలి. షూటింగులు చేయాలి.

అలాగే సినీ ప్రముఖులు ఉంటామంటే ఇళ్ళ స్థలాలు ఇస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఆ విధంగా వారు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడ సినీ కార్యకలాపాలు మొదలుపెడితేనే జగన్ పడుతున్న శ్రమకు, ఆయన కంటున్న కలలకు సార్ధకత  ఉంటుంది.

ఇక్కడ ఒకటి స్పష్టం. ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చింది. సినీ పెద్దలు కూడా దాన్ని అందిపుచ్చుకుని విశాఖలో టాలీవుడ్ వచ్చేందుకు మనస్పూర్తిగా  సహకారం అందించాలి. అలా జరగాలని అంతా కోరుకోవాలి కూడా.

జన్వాడ ఫామ్ హౌస్ రహస్యాలు

జగన్ గారికి చాలా థాంక్స్