సంక్రాంతి బరిలో బాలయ్యా? ‘వీరయ్యా’?

2023 సంక్రాంతికి మూడు సినిమాలు అన్నది ఫిక్స్ అయిపోయింది. మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య, విజయ్ వారసుడు, ప్రభాస్ ఆదిపురుష్. అక్కడి వరకు ఓకె కానీ బాలకృష్ణ ‘అన్నగారు/జై బాలయ్య’ సంగతేమిటి? అఖండ మాదిరిగా డిసెంబర్…

2023 సంక్రాంతికి మూడు సినిమాలు అన్నది ఫిక్స్ అయిపోయింది. మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య, విజయ్ వారసుడు, ప్రభాస్ ఆదిపురుష్. అక్కడి వరకు ఓకె కానీ బాలకృష్ణ ‘అన్నగారు/జై బాలయ్య’ సంగతేమిటి? అఖండ మాదిరిగా డిసెంబర్ లో విడుదల చేయాలన్నది నిర్మాతలు అయిన మైత్రీ మూవీస్ ప్లాన్. వాల్తేర్ వీరయ్య కూడా వాళ్లదే కనుక అది జనవరిలో పెట్టుకున్నారు. ఆ విధంగా రెండు నెలలు వరుసగా రెండు పెద్ద సినిమాలు విడుదల చేసుకొవచ్చు అన్నది ప్లాన్ గా కనిపిస్తోంది.

కానీ బాలయ్య ఈసారి తాను సంక్రాంతికి రావాలనుకుంటున్నారు. ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. బాలయ్యను ఒప్పించి డిసెంబర్ కే పరిమితం చేయాలన్నది మైత్రీ ఆలోచనగా తెలుస్తోంది.

ఇదీ నేపథ్యం.

కానీ ఇప్పుడు వాల్తేర్ వీరయ్య పండగకు వస్తుందా? అన్నది ఓ అనుమానం.

బాలయ్య సినిమా డిసెంబర్ నాటికి రెడీ అవుతుందా? అన్నది మరో అనుమానం.

ఎందుకంటే

బాలయ్య సినిమాకు ఇంకా 26 రోజులు వర్క్ వుందని వినిపిస్తోంది. నిన్నటికి నిన్న ఆర్ ఎఫ్ సి లో షెడ్యూలు మొదలు పెట్టారు. కానీ వర్షం వల్ల జరగలేదు. 26 రోజులు వర్క్ అంటే డిసెంబర్ విడుదల అన్నది చాలా టైట్ గా వుంటుంది. సంక్రాంతికి అయితే సరిపోతుంది.

మరోపక్కన వాల్తేర్ వీరయ్య సినిమాకు శృతి హాసన్ డేట్ అవసరం అనీ, ఆమె ఇప్పుడు రావడం లేదనీ తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం బాలకృష్ణ షూటింగ్ కు డేట్ లు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇవన్నీ చూస్తుంటే మెగాస్టార్ సినిమా వెనక్కు వెళ్లి బాలయ్య సినిమా సంక్రాంతికి వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ సంక్రాంతికి మైత్రీ తరపున థియేటర్ల అగ్రిమెంట్ మాత్రం మెగాస్టార్ సినిమా పేరు మీదే జరిగింది.