తన కన్నా చాలా చిన్న వయసు వాడిని పెళ్లి చేసుకుందని ప్రియాంక చోప్రా మీద కొందరు విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు అతడి ఆస్తిపాస్తుల వివరాలను చూసి ఆశ్చర్యపోతున్నారు వాళ్లంతా. ఇప్పటికే ప్రియాంక- నిక్ జోనస్ కాపురం మీద రకరకాల పుకార్లు పుట్టించారు. వారిద్దరూ విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారని కూడా వార్తలు వచ్చాయి.
అయితే అవన్నీ ఉట్టివే అని తేలిపోయింది. ఇటీవలే ప్రియాంక, నిక్ జోనస్, ప్రియాంక తల్లి.. అంతా తాపీగా సిగార్లు తాగుతూ బీచ్ లో కూర్చుని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. తద్వారా తమ కాపురం సవ్యంగా ఉందనివారు నిక్-ప్రియాంకలు ప్రకటించుకున్నట్టుగా అయ్యింది.
ఆ సంగతలా ఉంటే.. ప్రియాంక, నిక్ లు ఇప్పుడు కొత్త ఇంటికి మారబోతున్నారట. సొంతంగా కొనుక్కొని ఆ ఇంట్లో చేరబోతున్నారట. దాని ధర భారత ద్రవ్యమానంలో నూటా నలభై కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అమెరికన్ పత్రికలు చెబుతూ ఉన్నాయి.
ఇన్నాళ్లూ ప్రియాంక –నిక్ లు నలభై కోట్ల రూపాయల విలువ చేసే ఇంట్లో కాపురం ఉన్నారని, ఇప్పుడు దాన్ని అమ్మేసి నూటా నలభై కోట్ల రూపాయల ఇంటికి మారబోతూ ఉన్నారని ఆ పత్రికలు పేర్కొంటున్నాయి. కొత్తిళ్లు ప్రియాంక, నిక్ ల జాయింట్ ప్రాపర్టీ అని కూడా ఆ మీడియా వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం!