అంతే అంతేలేండి…నిమ్మ‌గ‌డ్డ కేసులో టీడీపీ స్ఫూర్తి

నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ విష‌యంలో కొంద‌రు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీని స్ఫూర్తిని తీసుకుని ముందుకెళుతున్నారు. పంచాయ‌తీరాజ్ చ‌ట్టంలో తీసుకొచ్చిన సంస్క‌ర‌ణ‌ల నేప‌థ్యంలో నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ ఎస్ఈసీ ప‌ద‌వి పోగొట్టుకోవ‌డం, అది కాస్త న్యాయ‌స్థాన మెట్లు ఎక్కిన…

నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ విష‌యంలో కొంద‌రు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీని స్ఫూర్తిని తీసుకుని ముందుకెళుతున్నారు. పంచాయ‌తీరాజ్ చ‌ట్టంలో తీసుకొచ్చిన సంస్క‌ర‌ణ‌ల నేప‌థ్యంలో నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ ఎస్ఈసీ ప‌ద‌వి పోగొట్టుకోవ‌డం, అది కాస్త న్యాయ‌స్థాన మెట్లు ఎక్కిన విష‌యం తెలిసిందే. మొట్ట మొద‌ట‌గా నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ హైకోర్టును ఆశ్ర‌యిస్తే… ఆయ‌న కేసులో సీపీఐ రామ‌కృష్ణ మొద‌లుకుని బీజేపీ నాయ‌కుడు, మాజీ మంత్రి కామినేని త‌దిత‌రులు ఇంప్లీడ్ అయిన విష‌యం తెలిసిందే. చివ‌రికి హైకోర్టులో నిమ్మ‌గ‌డ్డ వైపే న్యాయం నిలిచింది. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

ఇదిలా ఉంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగకుండా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను నియంత్రించాలంటూ హైకోర్టులో మంగళవారం మరో పిటిషన్‌ దాఖలైంది. ఆల్రెడీ సోమ‌వారం ఓ పిటిష‌న్ దాఖ‌లైంది. ప్ర‌స్తుతం దాఖ‌ల‌వుతున్న పిటిష‌న్ల‌కు హైకోర్టు ఇచ్చిన తీర్పే కార‌ణం కావ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నియామకం విషయంలో గవర్నర్‌దే విచక్షణాధికారమని.. ఈ విషయంలో రాష్ట్ర మంత్రిమండలికి ఎలాంటి అధికారం లేదని హైకోర్టు తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో  ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కొనసాగడానికి వీల్లేదంటూ రిటైర్డ్‌ ఐజీ డాక్టర్‌ ఎ.సుందర్‌కుమార్‌ దాస్‌ హైకోర్టును ఆశ్రయించారు.  2016లో అప్పటి మంత్రి మండలి సిఫారసు మేరకు  నియమితులైన నిమ్మగడ్డ.. ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా ఏ అధికారంలో ఆ పదవిలో కొనసాగుతున్నారో సంజాయిషీ అడగాలని దాస్  హైకోర్టును అభ్యర్థించారు. 2016లో నిమ్మగడ్డ రమేశ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం జారీచేసిన జీఓ 11ను కొట్టేయాలని ఆయ‌న కోరారు.

మొత్తానికి న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించే విష‌యాల్లో టీడీపీని ఏపీలో కొంద‌రు  స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. టీడీపీ నింపిన చైత‌న్యంతో న్యాయం కోసం పోరాటానికి శ్రీ‌కారం చుట్ట‌డం అభినంద‌నీయం. ఈ స్ఫూర్తి మ‌రింత బ‌లోపేతం కావాలి. ఆ దిశ‌గా మ‌రికొంద‌రు ముంద‌డుగు వేసే ప‌రిస్థితులు క‌ళ్లెదుట క‌నిపిస్తున్నాయి. 

జగన్ గారికి చాలా థాంక్స్