సింహా కోడూరి…భాగ్ సాలే

సినిమా మీద జనాల దృష్టి పడాలి అంటే ప్రాజెక్టు క్రేజీగా వుండాలి లేదా టైటిల్ అయినా అట్రాక్టివ్ గా వుండాలి. అలాంటి టైటిల్ తో వస్తోంది యంగ్ హీరో సింహా కోడూరి కొత్త సినిమా.…

సినిమా మీద జనాల దృష్టి పడాలి అంటే ప్రాజెక్టు క్రేజీగా వుండాలి లేదా టైటిల్ అయినా అట్రాక్టివ్ గా వుండాలి. అలాంటి టైటిల్ తో వస్తోంది యంగ్ హీరో సింహా కోడూరి కొత్త సినిమా. సినిమాకు టైటిల్ ‘భాగ్ సాలే…అని పెట్టడం అందుకోసమే కావచ్చు. 

ప్రణీత్ సాయి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ సినిమా బ్యానర్లపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు.

టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ “ఈతరం ప్రేక్షకులని అలరించే కథతో థ్రిల్లింగ్ క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న మా చిత్రం 'భాగ్ సాలే' ఫస్ట్ లుక్ నేడు విడుదలయింది. ప్రణీత్ సాయి దర్శకత్వంలో యువ హీరో సింహా, అర్జున్ పాత్రలో నటిస్తుండగా నేహా సొలంకి హీరోయిన్ గా నటిస్తున్నారు. జాన్ విజయ్, నందిని రాయ్ ప్రతినాయక పాత్రలు చేస్తున్నారు. ఏం చేసైనా అనుకున్నది సాధించాలనుకునే ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ ఆద్యంతం థ్రిల్ చేస్తుంది. ఇందులో రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి తదితరులు నటిస్తుండగా చిత్ర విజయం పై మాకు పూర్తి నమ్మకముంది.” అని అన్నారు.

సంగీతం కాల భైరవ అందిస్తుండగా, ఎడిటింగ్ కార్తీక ఆర్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ రమేష్ కుషేందర్ చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటూ విడుదలకి సిద్ధంగా ఉంది.