కొడుకును క్రికెటర్ ను చేస్తానంటున్న హీరోయిన్!

తన తనయుడిని క్రికెటర్ ను చేస్తానని అంటోంది కరీనా కపూర్ ఖాన్. ఇప్పటికే ఈమె తనయుడు తైమూర్ అలీఖాన్ దేశవ్యాప్తంగా చాలా గుర్తింపును పొందాడు. క్యూట్ కిడ్ గా సినిమా ఫొటోగ్రాఫర్లకు చేతినిండా పనిని…

తన తనయుడిని క్రికెటర్ ను చేస్తానని అంటోంది కరీనా కపూర్ ఖాన్. ఇప్పటికే ఈమె తనయుడు తైమూర్ అలీఖాన్ దేశవ్యాప్తంగా చాలా గుర్తింపును పొందాడు. క్యూట్ కిడ్ గా సినిమా ఫొటోగ్రాఫర్లకు చేతినిండా పనిని ఇచ్చాడు తైమూర్. సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ ల పెళ్లి ఎంత చర్చనీయాంశంగా నిలచిందో, తైమూర్ పేరు కూడా అంతేస్థాయి చర్చగా నిలిచింది.

అప్పటికే పెళ్లై, పిల్లలుండి, విడాకులు తీసుకున్న సైఫ్ ను కరీనా పెళ్లి చేసుకోవడం పట్ల చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ పెళ్లిని కరీనా వీరాభిమానులు ఆక్షేపించారు. అయితే వాటిని కరీనా లెక్క చేయలేదు. ఇక వీరి తనయుడికి తైమూర్ అని పేరు పెట్టినప్పుడు బోలెడంత మంది విరుచుకుపడ్డారు. ఆ పేరు ఇండియపై దండెత్తిన ఒక ముస్లింరాజు పేరు కావడంతో విమర్శలు చేశారు. అయినా ఖాతరు చేయక ఆ పేరుకే ఫిక్స్ అయ్యారు సైఫ్, కరీనా.

అయితే తైమూర్ అలీఖాన్ కు మీడియాలో పుష్కలమైన కవరేజీ లభిస్తూ వచ్చింది. ఇక తన తనయుడిని క్రికెటర్ ను చేయాలనుకుంటున్నట్టుగా కరీనా చెప్పింది. ఒక టీవీ షోలో ఈ వ్యాఖ్య చేసింది. తైమూర్ తాత భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. టైగర్ పటౌడీ ఇండియా జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించారు.

అలా తైమూర్ ను కూడా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించేలా చేయాలనుకుంటున్నట్టుగా కరీనా ప్రకటించింది. ఇటీవల వరల్డ్ కప్ సమయంలో  తైమూర్ అలీ ఖాన్ టీమిండియా జెర్సీతో దిగిన ఫొటోలో వైరల్ గా నిలిచాయి కూడా.

వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ..?