శర్వా రణరంగం రెడీ

వరుస సెలవులు ముందు వుండడంతో వారం తరువాత విడుదలయ్యే శర్వానంద్ రణరంగం సినిమాకు ఇప్పుడే సెన్సారు చేయించేసారు. మ్యూట్ లు, కట్ లు లాంటి సమస్యలు పెద్దగా ఏమీలేకుండా యు/ఎ సర్టిఫికెట్ వచ్చేసింది. సినిమాకు…

వరుస సెలవులు ముందు వుండడంతో వారం తరువాత విడుదలయ్యే శర్వానంద్ రణరంగం సినిమాకు ఇప్పుడే సెన్సారు చేయించేసారు. మ్యూట్ లు, కట్ లు లాంటి సమస్యలు పెద్దగా ఏమీలేకుండా యు/ఎ సర్టిఫికెట్ వచ్చేసింది. సినిమాకు ఫైనల్ మిక్సింగ్ మినహా మిగిలిన అన్నిపనులు పూర్తయ్యా. మరో రెండురోజుల్లో అది కూడా పూర్తయిపోతుంది.

స్వామిరారా, దోచేయ్, కేశవ సినిమాల తరువాత దర్శకుడు సుధీర్ వర్మ అందిస్తున్న సినిమా రణరంగం. ఓ యువకుడి జీవితంలోని రెండు పార్శ్వాలను స్పృశిస్తూ రూపొందించుకున్న కథతో ఈ సినిమా తీసారు. శర్వా సరసన కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ నటించారు.

రెండుగంటల 10 నిమషాలు ప్రధాన సినిమా నిడివి. అంటే సినిమా చాలా షార్ప్ గా ఎడిట్ చేసినట్లే అనుకోవాలి. విశాఖ నేపథ్యంలో, విదేశీ నేపథ్యంలో రెండుకథలు, ఇద్దరు హీరోయిన్లు, హీరోతో ప్లాన్ చేసినపుడు ఇంత సరైన నిడివిలో రావడం మెచ్చుకోదగ్గదే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదలవుతుంది.

వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ..?