Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

2020 సమ్మర్ కే ఆ సినిమా

2020 సమ్మర్ కే ఆ సినిమా

ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు పూరి జగన్నాధ్-యంగ్ హీరో విజయ్ దేవరకొండల కాంబినేషన్ ఫిక్స్ అయింది. అయితే ఈ కాంబినేషన్ లో సినిమా చూడాలంటే మాత్రం 2020 సమ్మర్ వరకు ఆగాల్సిందే. ఈ లోగా విజయ్ రెండు సినిమాలు పూర్తిచేస్తాడు.

క్రాంతి మాధవ్ డైరక్షన్ లో చేసే సినిమా ఫినిష్ చేసి, అక్టోబర్ లేదా నవంబర్ నుంచి మైత్రీమూవీస్ నిర్మించే హీరో సినిమా మీదకు వస్తాడు విజయ్. ఆ సినిమాను ఫిబ్రవరి లోగా ఫినిష్ చేసి, పూరి సినిమా స్టార్ట్ చేస్తారు. పూరి సినిమాను మూడునెలల్లో తీసి సమ్మర్ కు విడుదల చేయాలన్నది ప్లాన్.

పూరి డైరక్షన్ లో నిర్మించే సినిమా ఆయన-చార్మిల స్వంత బ్యానర్ లపైనే వుంటుంది. అంటే 2020 సమ్మర్ లోగా మూడు సినిమాలు విడుదల చేయాలన్నది విజయ్ ప్లాన్ గా కనిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ నేపథ్యంలో పూరితో విజయ్ సినిమా అంటే ఆ సినిమాకు బజ్ ఓ లెక్కలో వుంటుంది. ఇప్పటి వరకు ఓ లెక్క.. పూరి సినిమాలో మరో లెక్క అన్నట్లు వుంటుంది వ్యవహారం. 

వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ..?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?