ఇంతకీ ఎన్ని సీట్లు రావాల్సింది చంద్రబాబూ!

తాము మరీ ఇరవై మూడు సీట్లకు పరిమితం కావడం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చాలా ఫీలయిపోతూ ఉన్నారు. ఇదివరకూ కూడా చంద్రబాబు నాయుడు ఈ అంశం మీద చాలా బాధపడిపోయినట్టుగా వార్తలు…

తాము మరీ ఇరవై మూడు సీట్లకు పరిమితం కావడం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చాలా ఫీలయిపోతూ ఉన్నారు. ఇదివరకూ కూడా చంద్రబాబు నాయుడు ఈ అంశం మీద చాలా బాధపడిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. 'మరీ ఇన్ని తక్కువ సీట్లా.. మరీ ఇరవై మూడేనా..' అంటూ చంద్రబాబు నాయుడు అప్పట్లో వాపోయినట్టుగా, పార్టీ నేతల వద్ద ఈ రకంగా వ్యాఖ్యానించినట్టుగా ఆయన అనుకూల మీడియానే కథనాలు రాసింది.

తాము ఓడిపోవడం బాధ కాదు కానీ, మరీ ఇరవై మూడుసీట్లకే పరిమితం కావడంపట్ల చంద్రబాబు నాయుడు అప్పుడు తెగ ఇదైపోయారు. చంద్రబాబు బాధను చూసి సగటు తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా అలాగే ఫీలయ్యారు. కొందరు తెలివిగా అంతా ఈవీఎంలదే తప్పు అని నెట్టేశారు.

ఇక చంద్రబాబు నాయుడు మాత్రం అలా సమాధాన పడటంలేదట. తాజాగా పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మళ్లీ అదే రకంగా వాపోయారట. 'మరీ ఇరవై మూడు సీట్లేనా.. ఇలాంటి ఎన్నికలను ఎప్పుడూ చూడలేదు..' అని చంద్రబాబు నాయుడు వాపోయారట. మరి ఇంతలా బాధపడిపోతున్న చంద్రబాబు నాయుడు ఇంతకీ తమపార్టీకి ఎన్ని సీట్లు రావాల్సిందో చెప్పడంలేదు.

తను మరీ ఇరవైమూడు సీట్లకు పరిమితం అయ్యేలా పాలించలేదని చంద్రబాబు నాయుడు అంటున్నారట. ఇంతకీ ఎన్ని సీట్లను తెచ్చుకునేంతలా పాలించినట్టో కూడా చంద్రబాబు నాయుడే వివరిస్తే బాగుంటుందేమోనని పరిశీలకులు వ్యాక్యానిస్తూ ఉన్నారు.

వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ..?