ఓ ప్రముఖ యాంకర్ అసభ్య ప్రవర్తన…సభ్య సమాజం అసహ్యించుకునేలా ఉంది. ఆ ప్రముఖ యాంకర్, న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యుమో తమ్ముడు క్రిస్ క్యూమో. సదరు టీవీ యాంకర్ విపరీత పోకడలకు నిదర్శనం అతను ఓ వీడియోలో నగ్నంగా కనిపించడం. తన భార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యోగా వీడియోలో అతను దిగంబరంగా ప్రత్యక్షమయ్యాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పరుష పదజాలంతో తిట్టిపోస్తున్నారు. న్యూయార్క్‌లోని హాంప్టన్ మాన్షన్ గార్డెన్లో క్రిస్ భార్య క్రిస్టినా గ్రీవెన్ క్యుమో యోగా చేస్తుంటారు. భార్య యోగా చేసే సమయంలో ఇంగితం మరిచిన సదరు యాంకర్ క్రిస్ గార్డెన్‌లోకి నగ్నంగా వచ్చి అటువైపు తిరిగి నిలబడ్డాడు. దీన్ని గమనించని అతని భార్య ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో నేరుగా పోస్ట్ చేయడం గమనార్హం.
ఈ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు బిత్తరపోయారు. అసలేం చూస్తున్నామో, ఎందుకిలా జరిగిందో కాసేపటి వరకు అర్థం కాలేదు. ముఖ్యంగా అమెరికన్ నెటిజన్స్ అతను ప్రముఖ యాంకర్‌తో పాటు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యుమో తమ్ముడు క్రిస్ క్యూమో అని గుర్తు పట్టారు.
ఆ వెంటనే తేరుకున్న యాంకర్ భార్య … ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించింది. అప్పటికే ఆ వీడియోను స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్న నెటిజన్లు క్రిస్ ఫొటోలను తిరిగి పోస్ట్ చేయడంతో 49 ఏళ్ల యాంకర్ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇదిలా వుండగా క్రిస్ క్యుమోకు మార్చి 31న కరోనా పాజిటివ్ అని తేలింది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి విపరీత ధోరణులు సోషల్ మీడియాకు అప్రతిష్ట తీసుకొస్తాయనడంలో సందేహం లేదు.