శివశంకరి పాటని భ్రష్టు పట్టించిన బాలకృష్ణ

ఆ మధ్యన ఒక సినిమా ఫంక్షన్ లో బాలకృష్ణ స్టేజెక్కి “నీ కంటి చూపుల్లోన” పాట పాడుతూ అందులో రాగాల్ని ఖూనీ చేస్తున్నప్పుడు సిగ్గుతో మెలికలు తిరిగి నవ్వుతూ తొందరగా చప్పట్లు కొట్టేసి కిందకి…

ఆ మధ్యన ఒక సినిమా ఫంక్షన్ లో బాలకృష్ణ స్టేజెక్కి “నీ కంటి చూపుల్లోన” పాట పాడుతూ అందులో రాగాల్ని ఖూనీ చేస్తున్నప్పుడు సిగ్గుతో మెలికలు తిరిగి నవ్వుతూ తొందరగా చప్పట్లు కొట్టేసి కిందకి దింపేస్తే అది ప్రశంస అనుకున్నాడు కాబోలు. 

పూరీ జగన్నాథ్ సినిమాలో “మామ ఎక్ పెగ్ లావ్..” పాటని ఆటోట్యూనర్లు వగైరాలు పెట్టి సంగీత దర్శకుడు నానా కష్టాలు పడి పందిని నందిని చేస్తే అది హిట్టైంది..దాంతో తాను గొప్ప సింగర్ని అనుకున్నాడు కాబోలు.

ఇప్పుడు ఏకంగా శివశంకరీ పాట మీద పడ్డాడు. జగదేకవీరునికథలోని ఆ పాట పాడడానికి గొంతులో స్వరాలు పలికే సంగీతం తెలిసిన సింగర్లే ఒకటికి నాలుగుసార్లు సంకోచిస్తారు. అంత పెద్ద క్లాసిక్ అది. ఘంటసాల గారు పాడిన అద్భుత గీతం.

ఎవరో అనామకుడు ఎదో ప్రయత్నించాడులే అనుకుంటే ఓకే. కానీ ఒక హీరో, కళకి ఎంతో గౌరవం ఇచ్చే ఒక మహానటుడి కొడుకు ఇలా గార్దభస్వరంతో ఆ పాటని ఖూనీ చెయ్యడం క్షమించరాని నేరం అని సంగీతం తెలిసినవారు అంటున్నారు. 

ఈ పాట విన్నాక ఆర్జీవీ పాడిన పురుగు పాట చాలా వినసొంపుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.