బాలయ్య గాత్రానికి వందనాలు

తన 60 వ బర్త్ డే సందర్బంగా హీరో బాలకృష్ణ ఓ సాహసం చేసారు. తెలుగు సినిమాల్లోని టాప్ 10 అపురూప గీతాల్లో ఒకటి, అమర గాయకుడు ఘంటశాల పాడిన పాటల్లో టాప్ 5…

తన 60 వ బర్త్ డే సందర్బంగా హీరో బాలకృష్ణ ఓ సాహసం చేసారు. తెలుగు సినిమాల్లోని టాప్ 10 అపురూప గీతాల్లో ఒకటి, అమర గాయకుడు ఘంటశాల పాడిన పాటల్లో టాప్ 5 లో నిలిచేది అయిన 'శివానందలహరి' గీతాన్ని బాలకృష్ణ ఆలపించారు. దాన్ని తన పుట్టిన రోజు కానుకగా అభిమానులకు అందించారు. 

శివానందలహరి గీతం అంటే సినిమా గీతాల్లో ఓ అద్భుతం. ఘంటశాల ఈ పాట పాడడానికి ఎంత కష్టపడిందీ, ఎంత కృషి చేసిందీ అనాటి తరం సినిమా ప్రియులు కథలు కథలుగా చెప్పుకుంటారు. అలాంటి పాటను బాలయ్య చాలా టేకిట్ ఈజీ అన్నట్లు పాడేసారు. ఎలా పాడారు? బాగుందా లేదా? అక్షరాలు అన్నీ స్పష్టంగా, స్వర బద్దంగా, సుస్వరంగా పలికాయా? లేదా, ఆ గాత్రం ఎలా వుందీ అన్నది ఆ పాట వినే శ్రోతలకే అర్థం అవుతుంది. లేదూ అంటే ఘంటశాల పాటను, బాలయ్య పాటను మార్చి మార్చి వింటే, బాలయ్య పాట వినగలరా లేదా అన్నది తెలిసిపోతుంది. 

కానీ హేమా హేమీ గాయకులు కూడా పాడడానికి ధైర్యం చేయలేని పాటను బాలయ్య పాడేయడం అంటే ఏం చెప్పాలి? దేవులపల్లి కృష్ణశాస్త్రి చెప్పినట్లు 'నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు…నా ఇచ్ఛయే గాక నాకేటి వెరపు' అన్నట్లు, బాలయ్య తన మనసులోని కోరిక అలా తీర్చేసుకున్నారు అనుకోవాలి. ఆయన ధైర్యానికి హ్యాట్సాప్. ఘంటసాల పాట విడియో మీద ఆయన గాత్రాన్ని ఓవర్ ల్యాప్ చేసి వదలినందుకు వేవేల నమస్కారాలు. అంతే.