బాలయ్య-బోయపాటి…పెప్పర్ టీజర్

సీన్లను ఎలివేట్ చేయడంలో బోయపాటి స్టయిలే వేరు. వినయ విధేయ రామ సినిమాతో దెబ్బ తింటే తిని వుండొచ్చు కానీ, బాలయ్యకు మరిచిపోలేని రెండు హిట్ లు ఇవ్వగలిగింది ఆయనేగా. లేటెస్ట్ గా బిబి3…

సీన్లను ఎలివేట్ చేయడంలో బోయపాటి స్టయిలే వేరు. వినయ విధేయ రామ సినిమాతో దెబ్బ తింటే తిని వుండొచ్చు కానీ, బాలయ్యకు మరిచిపోలేని రెండు హిట్ లు ఇవ్వగలిగింది ఆయనేగా. లేటెస్ట్ గా బిబి3 అంటూ బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో సినిమా రెడీ అవుతోంది. ఇప్పటికి ఒక్క షెడ్యూలు మాత్రమే జరిగింది. ఇందులోంచే చిన్న టీజర్ కట్ చేసి బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదల చేసారు.

జస్ట్ ఒక్క నిమిషం మూడు సెకెండ్ల ఈ టీజర్ లో బాలయ్య కాస్త మిడిల్ ఏజ్డ్ లుక్క లో కనిపించారు. ఈ మధ్యకాలంలో బాలయ్య బెస్ట్ లుక్ ఇదే అనుకోవాలి. బోయపాటి మార్కు హై ఓల్టేజ్ యాక్షన్ సీన్, అందులో బాలయ్య పవర్ ఫుల్ డైలాగు టీజర్ లో వున్నాయి. 'ఎదుటివాడితో మాట్లాడేటపుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో, శీనుగారూ మీ నాన్నగారు బాగున్నారా అన్నదానికి, శీనుగారూ మీ అమ్మ మొగుడు బాగున్నాడా అన్న దానికి చాలా తేడా వుందిరా లమ్డీ కొడకా' అంటూ బాలయ్య ఘర్జిస్టూ డైలాగు చెప్పారు. 

టీజర్ మాత్రం కచ్చితంగా సినిమా మీద అంచనాలు పెంచేలా వుంది.  ఇదిలా  వుంటే ఈ సినిమా కు మోనార్క్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారని వినిపించింది. కానీ ప్రస్తుతానికి అయితే టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు.