సైరాకు అవార్డు కావాలా?

నెటిజన్లు భలేగా వుంటారు. సెలబ్రిటీలను తమ చిత్తానికి కామెంట్ చేసేయగలరు వీళ్లు. అస్సలు మొహమాటం వుండదు. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి మీద ఇలాంటి కామెంట్లే పడుతున్నాయి. ఆయన తన టాలీవుడ్ సహచరులతో కలిసి…

నెటిజన్లు భలేగా వుంటారు. సెలబ్రిటీలను తమ చిత్తానికి కామెంట్ చేసేయగలరు వీళ్లు. అస్సలు మొహమాటం వుండదు. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి మీద ఇలాంటి కామెంట్లే పడుతున్నాయి. ఆయన తన టాలీవుడ్ సహచరులతో కలిసి వెళ్లి ఆంధ్ర సిఎమ్ జగన్ ను కలిసి వచ్చారు. ఈ సందర్భంగా పలు విషయాలతో పాటు, నంది అవార్డుల ఫంక్షన్ గురించి కూడా ప్రస్తావించారు. చిత్రమేమిటంటే కొన్నాళ్ల క్రితం తెలంగాణ సిఎమ్ కెసిఆర్ ను కలిసినా కూడా సినిమా అవార్డుల ఫంక్షన్ గురించి మాట మాత్రమైనా ప్రస్తావించలేదు. 

దీనిపై నెటిజన్లు భలేగా కామెంట్ చేస్తున్నారు. సైరా సినిమాకు అవార్డు కోసం అర్జెంట్ గా నంది అవార్డులు పునరుద్దరించి, ఫంక్షన్ చేయాలా? అని కామెంట్ చేస్తున్నారు. సైరా సినిమా విడుదలైన ఏడాదికి సంబంధించి నంది అవార్డుల ఫంక్షన్ చేస్తే, కమిటీ ఎలాగూ సైరాలో చిరుకు ఉత్తమనటుడి అవార్డును, సైరాను ఉత్తమ చిత్రంగానూ సిఫార్సు చేసే అవకాశం ఎక్కువ వుంటుందని, అందుకే చిరు ఈ చిరు కోరిక కోరారని ట్విట్టర్ లో కామెంట్లు కనిపిస్తున్నాయి. 

ఏమైనా 65 ఏళ్ల వయస్సులో చిరంజీవికి పేరు మీద దృష్ఠి బాగా మళ్లినట్లు కనిపిస్తోంది.

జగన్ గారికి చాలా థాంక్స్

జన్వాడ ఫామ్ హౌస్ రహస్యాలు