అక్కినేని అమల అంటే శివ సినిమానే గుర్తుకొస్తుంది. కాలేజీ స్టూడెంట్స్‌గా నాగార్జున, అమల అప్పట్లో అభిమానుల్ని ఆకట్టుకున్నారు. రీల్ లైఫ్‌లో వాళ్లిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత రియల్ లైఫ్‌లో 1992లో నాగార్జున, అమలు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో నటనకు పూర్తిగా దూరమయ్యారు.
1991లో అమల నటించిన తమిళ సినిమా ‘కార్పూరా ముల్లై’ విడుదలైంది. వివాహం అనంతరం కుటుంబ వ్యవహారాలు చూసుకోవడంలో నిమగ్నమైన అమల…సుదీర్ఘ విరామం తర్వాత 2012లో విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. నాటి నుంచి అడపాదడపా ఆమల సినిమాల్లో నటిస్తున్నారు.
అప్పుడప్పుడు టీవీ షోల్లో కనిపిస్తూ ఉంటారు. కానీ ఆమె చిత్రసీమకు దూరంగా ఏమీ లేరు. అన్నపూర్ణ ఫిలిం స్కూల్ వ్యవహారాలను ఆమే చూసుకుంటున్నారు. తెలుగు, హిందీ, మలయాళం తదితర భాషా చిత్రాల్లో నటిస్తున్నారు. హై ప్రీస్ట్ అనే వెబ్‌సిరీస్‌లో అమలది కీరోల్.
ప్రస్తుతానికి వస్తే తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో హీరో శర్వానంద్‌కు తల్లిగా అమల నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్‌ను శర్వానంద్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలైతే అమల మూడు దశాబ్దాల తర్వాత తమిళ తెరపై కనిపించినట్టే.