ఈ ఏడాదిలోనే నంది అవార్డుల వేడుక

నంది అవార్డుల వేడుక ఈ ఏడాదే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఆగిపోయిన ఈ అవార్డుల వేడుకపై సినీప్రముఖులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో సినీప్రముఖులు,…

నంది అవార్డుల వేడుక ఈ ఏడాదే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఆగిపోయిన ఈ అవార్డుల వేడుకపై సినీప్రముఖులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో సినీప్రముఖులు, ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. మీటింగ్ పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి ఈ విషయాన్ని బయటపెట్టారు.

“నంది అవార్డులు చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలని అంతా కోరుకుంటారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే
స్పందించారు. 2019-20కు సంబంధించిన నంది అవార్డులు ఇవ్వడానికి నిర్ణయించారు. ఈ ఏడాదిలోనే నంది అవార్డుల వేడుక చోటుచేసుకుంటుందనుకుంటున్నాను.”

సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా  స్పందించారన్న చిరంజీవి.. ఆంధ్రప్రదేశ్ లో కూడా షూటింగ్స్ జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారన్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలతో త్వరలోనే ఆదేశాలు జారీ అవుతాయని తెలిపారు. మరోవైపు విశాఖలో సినీపరిశ్రమ స్థాపనపై కూడా సమావేశంలో కీలక చర్చ జరిగినట్టు చిరంజీవి వెల్లడించారు.

“వైజాగ్ లో సినీపరిశ్రమ అభివృద్ధి కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 3వందల ఎకరాలకు పైగా కేటాయించారు. దాన్ని మళ్లీ పరిశీలిస్తానని సీఎం మాటిచ్చారు. వైజాగ్ లో స్టుడియోలు నిర్మించేవారికి, ఔట్ డౌర్ యూనిట్లు స్థాపించాలనుకునేవాళ్లకు అన్ని రకాలుగా ప్రోత్సహం ఇస్తానని హామీ ఇచ్చారు. అలా చేస్తే ఏపీలో కూడా సినీపరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుంది.”

మొత్తమ్మీద జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఏడాది తర్వాత, ఆయన్ను కలవడానికి ఇండస్ట్రీకి తీరిక దొరికింది. ఈ సమావేశంలో చిరంజీవితో పాటు నాగార్జున, దిల్ రాజు, సురేష్ బాబు, రాజమౌళి, సి.కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. 

తమ్ముడు అలా.. అన్న ఇలా

జన్వాడ ఫామ్ హౌస్ రహస్యాలు