బాబుగారు ఎప్పుడూ అలా ఇచ్చినట్లు లేదే..

చంద్రబాబునాయుడు తాను ముఖ్యమంత్రిగా ఉండగా గత అయిదేళ్లలో (ఎన్డీయేతో సున్నం పెట్టుకునేంత వరకూ) 29 సార్లు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ప్రధాని నుంచి కేంద్రంలోని పెద్దలందరినీ పదేపదే కలిశాననీ.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తెచ్చేస్తున్నానని తొలిరోజుల్లోనూ,…

చంద్రబాబునాయుడు తాను ముఖ్యమంత్రిగా ఉండగా గత అయిదేళ్లలో (ఎన్డీయేతో సున్నం పెట్టుకునేంత వరకూ) 29 సార్లు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ప్రధాని నుంచి కేంద్రంలోని పెద్దలందరినీ పదేపదే కలిశాననీ.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తెచ్చేస్తున్నానని తొలిరోజుల్లోనూ, ప్యాకేజీ అని మలి రోజుల్లోనూ వల్లించారు. చివరికి వారిని తిట్టడం మొదలెట్టారు. ఇక్కడ పాయింటేంటంటే.. ఈ 29 సార్లు వెళ్లగా, ఎన్నడూ కూడా ఆయన తాను ప్రధానికి గానీ, కేంద్రంలో కీలకమైన పెద్దలకు గానీ స్వయంగా ఇచ్చిన వినతిపత్రం డాక్యుమెంట్ ను ప్రజలకు విడుదల చేయలేదే! కానీ, ఇవాళ జగన్మోహన రెడ్డి ఢిల్లీ వెళ్లగానే… ఆ డాక్యుమెంట్ ప్రజల డాక్యుమెంట్.. దానిని బయటపెట్టి తీరాల్సిందే.. అంటూ తెలుగుదేశం వాళ్లు యాగీ చేస్తున్నారెందుకు?

నిజానికి ఇక్కడ గతంలో చంద్రబాబునాయుడు ఎన్నడూ కూడా కేంద్రానికి ఇచ్చే వినతిపత్రం డాక్యుమెంట్ ను ప్రజలకు రిలీజ్ చేయకపోవడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒక ముఖ్యమంత్రి, ప్రధానికి డాక్యుమెట్ సమర్పిస్తే అందులో, ‘అందరికీ తెలియవలసిన అవసరం లేని’ అనేక అంశాలు ఉండవచ్చు. వాటిలో ఎంతవరకు బయటకు చెప్పగలరో.. అంతవరకు చెబుతారు. దీన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే తమ పాలనలో ఎన్నడూ చేయని పనిని.. జగన్ మాత్రం చేయాలని తెలుగుదేశం నాయకులు, యనమల రామకృష్ణుడు ఏ నైతిక హక్కుతో అడగగలుగుతున్నారో అర్థంకావడం లేదు.

ఏదో ఒక రకంగా వ్యవహారాలను రచ్చకీడ్చడం, గోల చేయడం తప్ప మరో ఉద్దేశ్యం తెలుగుదేశానికి ఉన్నట్లుగా కనిపించడం లేదు. విద్యుత్తు ఒప్పందాల్లో అక్రమాలకు పాల్పడ్డారని గణాంకాల సహా జగన్ నిగ్గు తేల్చారు. ఆ వ్యవహారం వారికి చాలా కంటగింపుగా ఉన్నట్లుంది. అలాంటివి గనుక విచారణలో తేలితే క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను ఎదుర్కోవాల్సి రావొచ్చు. జగన్ లేఖలో అలాంటి వినతి ఉన్నదేమో అని, అరెస్టులు తప్పవేమోనని వారు భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది.

చెప్పగలిగినంత వరకు జగన్ చెప్పారు. ఒకవేళ తెలుగుదేశం డిమాండును పాక్షికంగా పరిగణనలోకి తీసుకుని.. అభ్యంతరాల్లేని కొన్ని బాగాలను బయటపెడతారు. అందుకు తెదేపా వారు జవాబుదారీతనం వహిస్తారా? ఒప్పందాల్లో జరిగిన అవినీతి గురించి, డాక్యుమెంట్ లో ఉన్న బాగాలను జగన్ బయటపెట్టారనే అనుకుందాం. దానికి వీరు జవాబు చెబుతారా? స్థిరమైన ఆలోచన ఏదీ లేకుండా.. ఏదో భయాలు పెంచుకుంటే.. ఇలాంటి శుష్క వాదనలు సాగించడం ఎందుకు అని ప్రజలు భావిస్తున్నారు.

వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ..?