ఢిల్లీ మద్యం స్కాం కేసులో ఈడీ మరోసారి దేశవ్యాప్తంగా దాడులు చేస్తోంది. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, పంజాబ్ లోని 35 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. నాలుగు బృందాలుగా ఏర్పడిన ఈడీ అధికారులు బంజారాహిల్స్, కూకట్ పల్లి, మాదాపూర్, జూబ్లీ హీల్స్ లో సోదాలు నిర్వహిస్తోంది.
తాజా దాడులపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ట్వీట్ చేస్తూ, “3 నెలల నుండి 500 కంటే ఎక్కువ దాడులు, 300 మందికి పైగా సిబిఐ / ఈడీ అధికారులు మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలను కనుగొనడానికి 24 గంటలు శ్రమిస్తున్నారు. కానీ ఏమీ కనుగొనలేకపోయారు ఎందుకంటే తప్పు జరగలేదనేది నిజం అనీ. చాలా మంది అధికారుల సమయాన్ని వారి నీచ రాజకీయాల కోసం వృధా చేస్తున్నారు. అంటూ మండిపడ్డారు.
లిక్కర్ కేసులో ఇప్పటికే ఆరెస్ట్ అయిన వినయ్ నయర్, మహేంద్రు ఇచ్చిన సమాచారంతో సోదాలు ఇవాళ ఈడీ దాడులు జరగడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో జరిగిన అవకతవకలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణ నేపధ్యంలో ఇప్పటికే 11 మంది ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేశారు.