ష‌ర్మిల మ‌రో శంక‌ర్ రావు కానుందా!

వైఎస్సార్ టీపీ అధ్య‌క్షురాలు వైయ‌స్ ష‌ర్మిల మ‌రో శంక‌ర్ రావు కాబోతున్న‌రా అంటే? స‌మాధానం అవును అంటూన్నారు. వైయ‌స్ఆర్ మరణాంతరం వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం త‌న మాట విన‌లేద‌ని…

వైఎస్సార్ టీపీ అధ్య‌క్షురాలు వైయ‌స్ ష‌ర్మిల మ‌రో శంక‌ర్ రావు కాబోతున్న‌రా అంటే? స‌మాధానం అవును అంటూన్నారు. వైయ‌స్ఆర్ మరణాంతరం వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం త‌న మాట విన‌లేద‌ని ఎటువంటి ప్ర‌జ‌ధార‌ణ లేని శంక‌ర్ రావును, టీడీపీ నుండి కింజరాపు ఎర్రన్నాయుడు లాంటి వారితో ఆక్ర‌మ కేసులు పెట్టించి జైలు పాలు చేసినట్లు ఇప్పుడు బీజేపీ కూడా ష‌ర్మిలను ఆస్త్రంగా ఉప‌యోగిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇవాళ వైయ‌స్ ష‌ర్మిల ఢిల్లీలోని సీబీఐ అధికారుల‌ను క‌లిసి సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తుల‌తో పాటు, కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంపై ఫిర్యాదు చేయ‌నున్నారు. ష‌ర్మిల ఫిర్యాదు వెనుక బీజేపీ పెద్ద‌లు ఉన్న‌రానేది తెరాస నేత‌లు బావిస్తున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ‌లోని ప్ర‌ముఖులు కాళేశ్వ‌రంపై ఫిర్యాదు చేసిన ఎటువంటి స్పంద‌న రాలేదు. ఎవ‌రూ ఎన్ని ఫిర్యాదులు వ‌చ్చిన స్పందిచని సీబీఐ.. వైయ‌స్ ష‌ర్మిల విష‌యంలో కచ్చితంగా స్పందిస్తుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. 

బ‌హుశ కేసీఆర్ జాతీయ పార్టీ ప్ర‌క‌ట‌న త‌ర్వాత మ‌రింత కొపంగా ఉన్న బీజేపీ పెద్ద‌ల‌కు ష‌ర్మిల ఫిర్యాదు పెద్ద‌ అయుధంగా త‌యారైంది అంటూన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శంక‌ర్ రావు ఉప‌యోగించుకున్న‌ట్లు బీజేపీ కూడా ష‌ర్మిలాను ఉప‌యోగించుకోని కేసీఆర్ ను దెబ్బ తియ‌బోతున్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణ‌లో రాజకీయ పార్టీ పెట్టి సుదీర్ఘ పాద‌యాత్ర చేస్తున్న ష‌ర్మిల ప్ర‌జాధ‌ర‌ణ పెద్ద‌గా లేక‌పోవ్వ‌డం వల్ల కేసీఆర్ కుటుంబంపై ఫిర్యాదు చేస్తున్నారు అంటూన్నారు టీఆర్ఎస్ శ్రేణులు. ఏదీ ఏమైనా ష‌ర్మిల ఫిర్యాదును శంక‌ర్ రావు ఫిర్యాదుతో పొల్చ‌డంతో తెలంగాణ రాజ‌కీయాల్లో పెద్ద దూమ‌ర‌మే రావచ్చంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. 

ఇదీ ఇలా ఉండగా తెలంగాణ‌లో జ‌ర‌గ‌బోతున్న మునుగోడు ఉపఎన్నిక‌కు ష‌ర్మిల పార్టీ దూరంగా ఉండి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి త‌మ స‌పోర్డ్ ఇవ్వాల‌ని వైయ‌స్ ష‌ర్మిల నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.