కూసుకుంట్ల వైపే టీఆర్ఎస్ మొగ్గు!

టీఆర్ఎస్ మునుగోడు అభ్య‌ర్ధిగా కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి పేరు ప్ర‌క‌టించారు. పార్టీ ఆవిర్భావం నుండి కొన‌సాగ‌డంతో పాటు గ్రామా స్ధాయిలో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నందుకే టీఆర్ఎస్ అధిష్టానం కూసుకుంట్ల అభ్య‌ర్ధిత్వం వైపు మొగ్గుచూపారు. కర్నె ప్రభాకర్,…

టీఆర్ఎస్ మునుగోడు అభ్య‌ర్ధిగా కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి పేరు ప్ర‌క‌టించారు. పార్టీ ఆవిర్భావం నుండి కొన‌సాగ‌డంతో పాటు గ్రామా స్ధాయిలో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నందుకే టీఆర్ఎస్ అధిష్టానం కూసుకుంట్ల అభ్య‌ర్ధిత్వం వైపు మొగ్గుచూపారు. కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య వంటి నేతలు టికెట్లు ఆశించినప్పటికీ కూసుకుంట్ల వైపే గులాబీ బాస్ మొగ్గు చూపారు. స‌ర్వే రిపోర్టుల అధారం చేసుకొని కూసుకుంట్ల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

2002లో కేసీఆర్ పిలుపు మేర‌కు ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌న టీచ‌ర్ ఉద్యోగానికి రాజీనామా చేసి కేసీఆర్ తో క‌లిపి ఉద్య‌మాల్లో క్రియాశీల‌కంగా ప‌నిచేశారు. 2014 అసెంబ్లీ ఎలక్షన్స్ లో మునుగోడు నుండి మొద‌టిసారిగా ఎమ్మెల్యే అయిన ప్ర‌భాక‌ర్ రెడ్డి 2018 ఎన్నిక‌ల్లో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి చేతిలో ఓట‌మి పాల‌య్యారు. మూడు సార్లు అసెంబ్లీకి పోటీ చేసిన ప్ర‌భాక‌ర్ రెడ్డి రెండు సార్లు ఓట‌మి చెంది ఒక‌సారి మాత్ర‌మే విజ‌యం సాధించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంలో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకున్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తననే మళ్లీ గెలిపిస్తారని, ఆయన ధీమాగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతిని తమ అభ్యర్థిగా కొన్ని రోజుల కిందట ప్రకటించింది. 

ముడూ పార్టీలకు చెందిన ముగ్గురు నాయ‌కులు ప్ర‌జ‌ల్లో మంచి అధార‌ణ ఉంది. మునుగోడు విజ‌యం మూడు పార్టీల‌కు చాల ఆవ‌స‌రం. ఈ ఎన్నిక త‌ర్వాత తెలంగాణ రాజ‌కీయాల్లో పెను మార్పులు జ‌ర‌గ‌వ‌చ్చంటూన్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.